Mokshagna | ఇన్నాళ్లకి తన తనయుడి సినిమా ఎప్పుడు మొదలు కానుందో చెప్పిన బాలయ్య.. ఫ్యాన్స్‌కి పూనకాలే..!
Mokshagna | నందమూరి బాలకృష్ణ తన తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తన కెరీర్‌లో ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. పౌరాణికం, జానపదం, యాక్షన్, రొమాంటిక్ ఇలా ఏ జానర్ అయిన సరే బాలయ్య ఆయా పాత్రలలో ఇట్టే ఒదిగిపోతాడు. ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ అనేక ప్రయోగాలు చేస్తూ అలరిస్తున్నాడు బాలయ్య. ప్రస్తుతం ఈ నందమూరి హీరో సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో […]

Mokshagna |
నందమూరి బాలకృష్ణ తన తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తన కెరీర్‌లో ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. పౌరాణికం, జానపదం, యాక్షన్, రొమాంటిక్ ఇలా ఏ జానర్ అయిన సరే బాలయ్య ఆయా పాత్రలలో ఇట్టే ఒదిగిపోతాడు.
ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ అనేక ప్రయోగాలు చేస్తూ అలరిస్తున్నాడు బాలయ్య. ప్రస్తుతం ఈ నందమూరి హీరో సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే బాలయ్య తనయుడు మోక్షజ్ఞని కూడా వెండితెరకి పరిచయం చేయాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుండో కోరుతూ వస్తున్నారు.
ఇదిగో అదిగో అనడమే తప్ప మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి పక్కా క్లారిటీ అనేది రావడం లేదు. అయితే అమెరికా తానా సభల్లో పాల్గొన్న బాలకృష్ణ.. అక్కడ తన కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఓపెన్ అయ్యారని తెలుస్తుంది. ఏపీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత తన తనయుడి సినిమా పనులు మొదలు కానున్నట్టు తెలియజేశాడట.
అంటే వచ్చే ఏడాది మోక్షజ్ఞ టాలీవుడ్‌లోకి పరిచయం కానుండగా, ఆయనని ఆదిత్య 369 సీక్వెల్ తో పరిచయం చేయనున్నట్టు బాలయ్య బాబు స్పష్టం చేసినట్లు టాక్. ఈ చిత్రంలో నందమూరి బాలయ్య బాబు ప్రధాన పాత్రలో కనిపించనుండగా.. మోక్షజ్ఞ తేజ మాత్రం ఓ కీలకమైన పాత్రలో కనిపించి అలరించనున్నాడట.
మోక్షజ్ఞ సినీ ఎంట్రీ బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే ఉంటుందా అనే ప్రశ్నకి అంతా దైవేచ్ఛ అని నవ్వి ఊరుకున్నారట. మరి నందమూరి అభిమానులకి త్వరలోనే తీపి వార్త రానుందని బాలయ్య మాటలని బట్టి అర్ధమవుతుంది. ఇక కొన్నాళ్లుగా మోక్షజ్ఞ పర్సనాలిటీపై అభిమానులలో చాలా ఆందోళన ఉండేది.
కాని ఇటీవల మోక్షజ్ఞ బర్త్ డే ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ కాగా, అందులో ఆయన స్లిమ్ లుక్‌లో కనిపించారు. ఈ పిక్స్ చూసి మోక్షజ్ఞ తన సినీ ఎంట్రీ కోసం బాగానే శ్రమిస్తున్నారని నందమూరి ఫ్యాన్స్ భావించారు. వచ్చే ఏడాది మాత్రం నందమూరి మోక్షజ్ఞ వెండితెరపై సందడి చేయనుండడం ఖాయంగా కనిపిస్తుంది. మరి తొలి సినిమాతో మోక్షజ్ఞ ఎంతలా అలరిస్తాడో చూడాలి.