TSPSC: ఉద్యోగ నియామక పరీక్ష తేదీలివే

TSPSC విధాత‌: రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) ప్రకటించింది. ఈ నెల 15, 16 వ తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్ష, ఏప్రిల్‌ 4న హార్టికల్చర్‌ ఆఫీసర్‌, ఏప్రిల్‌ 23న అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ASSISTANT MOTOR VEHICLES INSPECTOR ) నియామక పరీక్షలు నిర్వహించ‌నున్న‌ట్టు టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది. పశుసంవర్థన శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (క్లాస్‌ ఏ అండ్‌ బీ) పోస్టులకు, రవాణా శాఖలో 113 అసిస్టెంట్‌ […]

TSPSC: ఉద్యోగ నియామక పరీక్ష తేదీలివే

TSPSC

విధాత‌: రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) ప్రకటించింది. ఈ నెల 15, 16 వ తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్ష, ఏప్రిల్‌ 4న హార్టికల్చర్‌ ఆఫీసర్‌, ఏప్రిల్‌ 23న అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ASSISTANT MOTOR VEHICLES INSPECTOR ) నియామక పరీక్షలు నిర్వహించ‌నున్న‌ట్టు టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది.

పశుసంవర్థన శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (క్లాస్‌ ఏ అండ్‌ బీ) పోస్టులకు, రవాణా శాఖలో 113 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (AMVI) పోస్టులకు, 22 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ గతంలో వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం విదితమే.

ఆ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష తేదీలను సర్వీస్‌ కమిషన్‌ ఈరోజు ఖరారు చేసింది. అయితే హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే తేదీలను మాత్రం ప్రకటించలేదు. పూర్తి వివరాల కోసం https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ సందర్శించవచ్చని అభ్యర్థులకు సూచించింది.