పదవులు ఇచ్చేది వాళ్లే.. నేను కాదు: మంత్రి మల్లారెడ్డి

విధాత: పదవులు ఇచ్చేది సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తప్ప.. తాను కాదని కార్మిక మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్‌ జిల్లాలో పదవుల కేటాయింపుపై సోమవారం ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం అధికారపార్టీలో సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను గాంధేయవాదినని, ఎవరితో గొడవ పెట్టుకోనన్నారు. మాది క్రమశిక్షణ గలిగిన పార్టీ, ఇంటి […]

  • By: krs    latest    Dec 20, 2022 6:22 AM IST
పదవులు ఇచ్చేది వాళ్లే.. నేను కాదు: మంత్రి మల్లారెడ్డి

విధాత: పదవులు ఇచ్చేది సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తప్ప.. తాను కాదని కార్మిక మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్‌ జిల్లాలో పదవుల కేటాయింపుపై సోమవారం ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఉదంతం అధికారపార్టీలో సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను గాంధేయవాదినని, ఎవరితో గొడవ పెట్టుకోనన్నారు. మాది క్రమశిక్షణ గలిగిన పార్టీ, ఇంటి సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు.

తనపై అసంతృప్తి వ్యక్తం చేసిన పార్టీ ఎమ్మల్యేల వద్దకు వెళ్తాను. అవసరమైతే అందరినీ ఇంటికి ఆహ్వానిస్తానని చెప్పారు. మా మధ్య ఆ స్థాయిలో సమస్య లేదని మంత్రి తెలిపారు.