మ‌ద్యం మ‌త్తులో.. కుక్క తోక‌, చెవులు తిన్న మందు బాబులు

విధాత‌: మద్యం అన‌గానే చాలా మంది మందుబాబుల‌కు గుర్తొచ్చేది మాంసం. కోడి కూర లేదంటే మేక త‌ల‌కాయ కూర కోసం మందు బాబులు ఆరాట‌ప‌ డుతుంటారు. ఇక సింపుల్‌గా కానివ్వాలంటే ఒక‌ట్రెండు గుడ్లు ఆమ్లెట్ వేసుకొని కానిచ్చేస్తారు. అది కూడా వీలు కాని ప‌క్షంలో.. రెండు ప‌ల్లి గింజ‌ల‌తో మ‌ద్యం సేవించేస్తారు. కానీ ఈ మందు బాబులు మాత్రం మ‌ద్యం మ‌త్తులో రెచ్చిపోయారు. ఏకంగా కుక్క చెవుల‌ను, తోక‌ల‌ను మ‌ద్యానికి స్ట‌ఫ్‌గా ఉప‌యోగించారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌రప్ర‌దేశ్ […]

మ‌ద్యం మ‌త్తులో.. కుక్క తోక‌, చెవులు తిన్న మందు బాబులు

విధాత‌: మద్యం అన‌గానే చాలా మంది మందుబాబుల‌కు గుర్తొచ్చేది మాంసం. కోడి కూర లేదంటే మేక త‌ల‌కాయ కూర కోసం మందు బాబులు ఆరాట‌ప‌ డుతుంటారు. ఇక సింపుల్‌గా కానివ్వాలంటే ఒక‌ట్రెండు గుడ్లు ఆమ్లెట్ వేసుకొని కానిచ్చేస్తారు. అది కూడా వీలు కాని ప‌క్షంలో.. రెండు ప‌ల్లి గింజ‌ల‌తో మ‌ద్యం సేవించేస్తారు. కానీ ఈ మందు బాబులు మాత్రం మ‌ద్యం మ‌త్తులో రెచ్చిపోయారు. ఏకంగా కుక్క చెవుల‌ను, తోక‌ల‌ను మ‌ద్యానికి స్ట‌ఫ్‌గా ఉప‌యోగించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌రప్ర‌దేశ్ ఫ‌రీదాపూర్‌కు చెందిన ముకేశ్ వాల్మీకి త‌న ఫ్రెండ్‌తో క‌లిసి మ‌ద్యం సేవిస్తున్నాడు. అయితే స్ట‌ఫ్ అయిపోయింది. అదే స‌మ‌యంలో అటుగా వెళ్తున్న ఓ రెండు కుక్క పిల్ల‌ల‌ను ముకేశ్ అడ్డ‌గించాడు. వాటిని ద‌గ్గ‌కు తీసుకొని ఓ కుక్క చెవుల‌ను, మ‌రో కుక్క తోక‌ను క‌ట్ చేశాడు. అనంత‌రం చెవుల‌ను, తోక‌ను స్ట‌ఫ్‌గా ఉప‌యోగించి, మ‌ద్యం తాగేశారు. చెవుల‌ను, తోక‌ను ఆ మందు బాబులు ఆర‌గించ‌డాన్ని స్థానికులు గ‌మ‌నించారు. ఇక క్ష‌ణాల్లోనే వారు జంతువుల కోసం ప‌ని చేసే పీఎఫ్ఏ సంస్థ‌కు స‌మాచారం అందించారు.

సంస్థ రెస్క్యూ ఇన్​ఛార్జి ధీరజ్​ పాఠక్.. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన కుక్క పిల్లలను జంతు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం శునకం పిల్లలు చికిత్స పొందుతున్నాయి. నిందితులపై ఫరీదాపుర్​ పోలీసు స్టేషన్​లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ధీరజ్. జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.