ఇంతకు ముందులా పరిస్థితులు లేవు: మంత్రి రోజా
విధాత: కులం చూసి ఓటు వేసే రోజులు పోవాలి. మా వాడు, మా కులం అని చెప్పి ఓటు వేసి.. తర్వాత వాడు ఏం చేయలేదని బాధ పడేకన్నా.. మంచి వ్యక్తిని చూసి ఓటు వేసి గెలిపించుకుంటే ఖచ్చితంగా వాళ్లకి మంచి జరుగుతుందని అన్నారు ఏపీ మినిస్టర్ రోజా. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్నపాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’. […]

విధాత: కులం చూసి ఓటు వేసే రోజులు పోవాలి. మా వాడు, మా కులం అని చెప్పి ఓటు వేసి.. తర్వాత వాడు ఏం చేయలేదని బాధ పడేకన్నా.. మంచి వ్యక్తిని చూసి ఓటు వేసి గెలిపించుకుంటే ఖచ్చితంగా వాళ్లకి మంచి జరుగుతుందని అన్నారు ఏపీ మినిస్టర్ రోజా. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్నపాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’. వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని.. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
డిసెంబర్ 16న గ్రాండ్‌గా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రయూనిట్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ఓ గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తెలుగు ట్రైలర్‌ను ఏపీ మినిస్టర్ ఆర్.కె. రోజా, కన్నడ ట్రైలర్‌ను తుంగతుర్తి MLA డా. గాధరి కిశోర్ కుమార్, మలయాళం ట్రైలర్‌ను దర్శకుడు, నటుడు చిన్నికృష్ణ, తమిళ ట్రైలర్‌ను ‘నాంది’ సతీష్ విడుదల చేయగా.. టైటిల్ సాంగ్‌ను వైజాగ్ MLC వంశీకృష్ణ యాదవ్ విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖలు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు ట్రైలర్ విడుదల అనంతరం మినిస్టర్ రోజా మాట్లాడుతూ.. ‘‘శాసనసభ’’ అనే టైటిల్ వినగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమాలలో పొలిటికల్ సీన్స్ వచ్చినప్పుడు శాసనసభని చూపిస్తారు. కానీ ఈ సినిమాకే ‘శాసనసభ’ అని టైటిల్ పెట్టడం చాలా ఆసక్తికరంగా అనిపించింది. నేను కూడా సినిమా నుంచే పాలిటిక్స్‌కి వచ్చాను. ఇప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో ఇలా పొలిటికల్ సినిమా ఈవెంట్‌కు పిలవడం చాలా సంతోషంగా ఉంది.
నేను ఈ వేడుకకు రావడానికి రెండు కారణాలు. ఒకటి కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్. కేజీఎఫ్ సినిమాకి ఆయన ఇచ్చిన సంగీతం మళ్లీ మళ్లీ ఆ సినిమాని చూడాలనిపించేలా చేస్తుంది. మ్యూజిక్కే ఆ సినిమాకి హీరోలాగా ఉంటుంది. మరొకరు మా షణ్ముగం. దాదాపు 13 సంవత్సరాలుగా అతను తెలుసు. నాకో బ్రదర్ లాంటివాడు. మీరు వస్తేనే ట్రైలర్ విడుదల చేస్తానని అనడంతో.. అంత అభిమానం, ప్రేమకి లొంగిపోయాను.
శాసనసభలో ప్రస్తుతం సినిమా తరహా సీన్లే కనిపిస్తున్నాయి. ఏ లాంగ్వేజ్‌లో ట్రైలర్ చూసినా సేమ్ ఇంపాక్ట్ కలగడానికి అదే కారణం. ఇందులో మంచి మంచి ఆర్టిస్ట్‌లు ఉన్నారు. మా అందరికీ లక్కీ హీరో రాజేంద్ర ప్రసాద్‌గారు. ఆయనతో మొదటి సినిమా చేసిన వాళ్లందరం కూడా మంచి హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నాం. ఆయన ఎంత మంచి నటుడో అందరికీ తెలుసు. అలాంటి నటుడు ఒక మెయిన్ లీడ్‌లో.. కంట తడి పెట్టించ బోతున్నారు.
హీరో ఇంద్రసేనని చూసి.. సడెన్‌గా కేజీఎఫ్ హీరో వచ్చాడేమో అనుకున్నాను. చాలా చక్కగా ఇందులో ఆయన నటించారు. అలాగే హీరోయిన్ ఐశ్వర్య రాజ్ కూడా ఇందులో చక్కగా కనిపిస్తున్నారు. సోనియా అగర్వాల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటించినట్లుగా ట్రైలర్‌తో అర్థమైంది. హెబ్బా పటేల్ పబ్ సాంగ్‌లో కనిపించింది. ఈ ట్రైలర్‌లో రెండు డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి. వీటి గురించి ప్రజలు కూడా ఆలోచించాలి.
ఎందుకంటే కులం చూసి ఓటు వేసే రోజులు పోవాలి. మా వాడు, మా కులం అని చెప్పి ఓటు వేసి.. తర్వాత వాడు ఏం చేయలేదని బాధపడేకన్నా.. మంచి వ్యక్తిని చూసి ఓటు వేసి గెలిపించుకుంటే ఖచ్చితంగా వాళ్లకి మంచి జరుగుతుంది. కాబట్టి కులం, మతం, ప్రాంతం అనేది పక్కన పెట్టండి. మీ ప్రాంతంలో ఎవరు నిలబడ్డారు.. వారిలో ఎవరు బెస్ట్? ఎవరికి మనం ఓటేస్తే మంచి చేస్తారు అనే ఆలోచనతో.. ప్రతి ఒక్కరినీ ఓటేయమని కోరుకుంటున్నాను.
రెండోది.. ‘ఓటేసే రోజు మాత్రమే ఓటరు రాజురా.. ఆ తర్వాత 5 ఇయర్స్ మనమే రాజురా’ అంటారు. ఆ రోజులు పోయాయ్.. ఓటేసిన రోజు నుంచి.. మళ్లీ ఓటు వేసే రోజు వరకు ఎమ్మేల్యేలకి, ఎంపీలకి గడపగడపకి వెళ్లి.. మీకు ఏం ఇచ్చారు.. ప్రభుత్వం ఇచ్చినవన్నీ అందుతున్నాయా లేదా అని కనుక్కోవడమే కాకుండా.. ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి రోజు తిరుగుతున్నామంటే.. ఇంతకు ముందులా పరిస్థితులు లేవని అర్థం చేసుకోవాలి.
ఖచ్చితంగా మార్పు వచ్చింది.. దానికి తగ్గట్టే పొలిటికల్ లీడర్స్ కూడా మారాలి. సినిమా పరంగా ఈ రోజు మంచి ప్రొడ్యూసర్ దొరకడం అనేది చాలా కష్టం. అలాంటిది సినిమాలో నటించడానికి వెళ్లి, కంటెంట్ నచ్చి.. సినిమానే నిర్మించిన సప్పాని బ్రదర్స్‌కి కంగ్రాట్స్. డిసెంబర్ 16న వస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి. మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు.