అగ్రోస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తిప్పన విజయసింహారెడ్డి
హాజరైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లారాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్ల్యేలు, ఎంపీలు విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్ల్యే తిప్పన విజయ సింహారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఉదయం ఆగ్రోస్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డిల సమక్షంలో ఆగ్రోస్ సీఎండీ కె. రాములు చైర్మన్ […]

- హాజరైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి,
- మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి,
- రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లారాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్ల్యేలు, ఎంపీలు
విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్ల్యే తిప్పన విజయ సింహారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఉదయం ఆగ్రోస్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డిల సమక్షంలో ఆగ్రోస్ సీఎండీ కె. రాములు చైర్మన్ విజయ సింహారెడ్డి చేత బాధ్యతలు స్వీకరించే ఫైల్ పై సంతకం చేయించారు.
అనంతరం మంత్రులు విజయ సింహారెడ్డికి శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా రైతు బిడ్డ అయిన విజయ సింహారెడ్డి అగ్రోస్ చైర్మన్‌గా రైతులకు నిరంతరం సేవలు అందిస్తారన్నారు. రైతులకు సేవలు చేయడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు తిప్పన విజయ సింహారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ప్రత్యేకంగా అభినందించిన మండలి చైర్మన్
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అగ్రోస్ కార్యాలయానికి స్వయంగా వచ్చి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తిప్పన విజయ సింహారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. తిప్పన విజయ సింహారెడ్డి పదవీ బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమాన్ని మిర్యాల గూడ ఎమ్మెల్ల్యే భాస్కర్‌రావు దగ్గరుండి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ , శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిషోర్, పూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, టీఆర్ ఎస్ నాయకులు నాగార్జున చారి, సిద్దిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గజ్జల కోటిరెడ్డి, భిక్షం గౌడ్, చిట్టి బాబు నాయక్, తిరునగరు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.