హీరోగా ఈ అక్కినేని ఫ్యామిలీ హీరో‌.. ఇక కష్టమేనా?

విధాత: టాలీవుడ్‌లో కొన్ని ఫ్యామిలీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా, నందమూరి ఫ్యామిలీలతో పాటు అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ క్రేజ్‌లో ఉన్న లిస్ట్‌లో ఒకటి. ఒకప్పుడు అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ హయాంలో ఈ రెండు ఫ్యామిలీల పేర్లు బాగా హైలెట్ అయ్యేవి. చిరంజీవి ఎంటర్ అయిన తర్వాత ఒక్కో ఫ్యామిలీకి చెక్ పెడుతూ.. టాప్ స్థానంలోకి మెగా ఫ్యామిలీని చేర్చారు. సరే ఆ విషయం పక్కన పెడితే, అక్కినేని ఫ్యామిలీకి […]

  • By: krs    latest    Mar 19, 2023 7:05 AM IST
హీరోగా ఈ అక్కినేని ఫ్యామిలీ హీరో‌.. ఇక కష్టమేనా?

విధాత: టాలీవుడ్‌లో కొన్ని ఫ్యామిలీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా, నందమూరి ఫ్యామిలీలతో పాటు అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ క్రేజ్‌లో ఉన్న లిస్ట్‌లో ఒకటి. ఒకప్పుడు అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ హయాంలో ఈ రెండు ఫ్యామిలీల పేర్లు బాగా హైలెట్ అయ్యేవి. చిరంజీవి ఎంటర్ అయిన తర్వాత ఒక్కో ఫ్యామిలీకి చెక్ పెడుతూ.. టాప్ స్థానంలోకి మెగా ఫ్యామిలీని చేర్చారు.

సరే ఆ విషయం పక్కన పెడితే, అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి కొన్నాళ్లుగా సరైన హిట్ లేదు. హీరోలంతా పాన్ ఇండియా రేంజ్‌లో దుమ్ము దులుపుతుంటే.. అక్కినేని ఫ్యామిలీలో మాత్రం అంత హుషారు కనిపించడం లేదు. అయ్యగారి ‘ఏజంట్’ ఏమైనా బ్లాక్‌బస్టర్ పడితే తప్ప.. అక్కినేని ఫ్యామిలీ గురించి మాట్లాడుకునే ఛాన్స్ లేదు. ఇక అక్కినేని ఫ్యామిలీ పేరుతో మరో ఇద్దరు ముగ్గురు హీరోలు చలామణీ అవుతున్నారు. వారిలో సుశాంత్ ఒకరు.

ఈ సుశాంత్ పరిస్థితి ఏమిటనేది ఇప్పుడెవరికీ అర్థం కావడం లేదు. ఇంతకు ముందు హీరోగా వరుసబెట్టి సినిమాలు చేసిన సుశాంత్‌కి.. ‘కరెంట్’, ‘అడ్డా’ రూపంలో ఓ మోస్తారు హిట్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా ఆయనకి అవకాశాలు రావడం లేదు. ఆయన చేసిన చాలా సినిమాలు సొంత బ్యానర్‌లోనే చేశాడు.

సుశాంత్ అమ్మగారైన నాగ సుశీల.. మరో నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుతో కలిసి సుశాంత్ నటించిన సినిమాలను నిర్మించారు. అయితే చింతలపూడి శ్రీనివాసరావుతో గొడవలు రావడంతో.. ఇప్పుడు ఆమె కూడా సినిమాలు తీయడం మానేశారు. దీంతో హీరోగా సుశాంత్‌కు అవకాశాలు రావడం లేదు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రం ఆయన బిజీ అవుతున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సుశాంత్.. ఇప్పుడు మరో మెగా హీరో సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఆ మెగా హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ చిత్రంలో సుశాంత్ ఓ పాత్రను చేస్తున్నట్లుగా తాజాగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ వెల్లడించారు.

ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. కీర్తి లవర్‌గా సుశాంత్ నటించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘రావణాసుర’ సినిమాలో కూడా సుశాంత్ ఓ కీలకపాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్‌తో ఆయన ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చారు.

ఇదంతా చూస్తుంటే, హీరోగా కాకుండా ఎలాంటి పాత్ర వచ్చిన చేయడానికి సుశాంత్ సిద్ధమయ్యాడనేది అర్థం అవుతుంది. మరి సరైన కథలు రాక ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడా? లేదంటే నిజంగా ఆయనకు హీరోగా అవకాశాలు రావడం లేదా? అనేది.. ఆయనకి మాత్రమే తెలిసిన విషయం.. అంతే.