చిత్రం చెప్పిన కథ: ఈ కలయిక అందుకోసమేనా!

విధాత: భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కే.చంద్రశేఖర రావుతో కొందరు అధికారులున్న ఫోటో చూసారు కదా. కోర్టు ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రిలీవ్ చేశాక 1989 బ్యాచ్ కు చెందిన శాంత కుమారిని ఆ పోష్టులో కేసీఆర్ నియమించారు. ఈ సందర్భంగా ఆమెతో బాటు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్ర శేఖర్, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ, జనసేన […]

  • By: krs    latest    Jan 12, 2023 4:18 PM IST
చిత్రం చెప్పిన కథ: ఈ కలయిక అందుకోసమేనా!

విధాత: భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కే.చంద్రశేఖర రావుతో కొందరు అధికారులున్న ఫోటో చూసారు కదా. కోర్టు ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రిలీవ్ చేశాక 1989 బ్యాచ్ కు చెందిన శాంత కుమారిని ఆ పోష్టులో కేసీఆర్ నియమించారు.

ఈ సందర్భంగా ఆమెతో బాటు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్ర శేఖర్, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ, జనసేన పార్టీ అడ్వైజర్, ప్రముఖ కాపు సమాజం నాయకులు బి.రామ్మోహన్ రావు ఇంకా 2019లో జనసేన తరఫున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన చింతల పార్థసారథి సైతం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సుధీర్ఘ భేటీలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

చిత్రంగా ఆ చిత్రంలో ఉన్నవాళ్ళంతా కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ఇది యాదృచ్చికమో, ఇంకేదో కావచ్చని అనుకున్నా దీని వెనుక సైతం ఓ ప్లాన్..స్కెచ్ ఉన్నట్లు తెలిస్తోంది.

ఈ గ్రూప్ ఫోటోలో ఉన్న వాళ్లంతా కాపు సామాజిక వర్గమే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ సంఖ్యలో ఉన్న కావు ప్రజలను తమ వైపునకు తిప్పుకునే లక్ష్యంతోనే తోట చంద్రశేఖర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్ ఇంకొందరు ముఖ్యులను సైతం తమతో కలుపుకుని పోవాలని నిర్ణయించుకున్నారు.

కానీ ఇంతవరకూ రావెల కిషోర్ బాబు మినహా పెద్దగా కాపు నేతలు, ఇతర వర్గాల నుంచి కూడా పెద్దగా ఎవరూ చేరలేదు. కానీ ఇప్పుడు శాంత కుమారి చీఫ్ సెక్రటరీ అయ్యాక ఈ మూర్తులంతా వెళ్లి కేసీఆర్‌తో గ్రూప్ ఫోటో దిగినట్లున్నారు.