విధాత: హీరోయిన్ శ్రీలీల.. చేసింది ఒక్కటే సినిమా. అయినా కూడా పిచ్చ క్రేజ్ ఆమె సొంతం. ‘పెళ్లిసందD’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన హీరోయిన్ శ్రీలీలకు ఆ తర్వాత వెంటనే మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ సినిమాలో అవకాశం రావడంతో.. ఒక్కసారిగా ఆమె పేరు వైరల్ అయింది. అలాగే ఆమె బ్యాక్‌గ్రౌండ్ కూడా మీడియాలో మాట్లాడుకోవడానికి కారణమైంది. ఫలితంగా ఇప్పుడామె ఫేమస్ యాక్టరైంది. ఎంతగా ఫేమస్ అయిందంటే.. ఒకవైపు బడ్జెట్ కంట్రోల్ చేయడానికి నిర్మాతలు తంటాలు పడుతుంటే.. టాలీవుడ్‌లోని […]
విధాత: హీరోయిన్ శ్రీలీల.. చేసింది ఒక్కటే సినిమా. అయినా కూడా పిచ్చ క్రేజ్ ఆమె సొంతం. ‘పెళ్లిసందD’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన హీరోయిన్ శ్రీలీలకు ఆ తర్వాత వెంటనే మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ సినిమాలో అవకాశం రావడంతో.. ఒక్కసారిగా ఆమె పేరు వైరల్ అయింది.
అలాగే ఆమె బ్యాక్‌గ్రౌండ్ కూడా మీడియాలో మాట్లాడుకోవడానికి కారణమైంది. ఫలితంగా ఇప్పుడామె ఫేమస్ యాక్టరైంది. ఎంతగా ఫేమస్ అయిందంటే.. ఒకవైపు బడ్జెట్ కంట్రోల్ చేయడానికి నిర్మాతలు తంటాలు పడుతుంటే.. టాలీవుడ్‌లోని ఒక యువ నిర్మాత ఆమె కోసం రోజుకి రూ. 20 వేలు రూమ్ రెంట్ కట్టేంతగా. అవును ఇది నిజం.
ఈ మధ్య నిర్మాతలు మీటింగులు పెట్టి.. రెమ్యూనరేషన్స్‌లో కోతలు విధిస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఆ నిర్మాతలకు నచ్చితే.. ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారనేది శ్రీలీల విషయంలో మరోసారి రుజువవుతోంది.
అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే కలర్‌ఫుల్ ఇండస్ట్రీ. కొత్తదనానికి, కొత్త అందానికి ఎప్పుడూ ఇక్కడ చోటుంటుంది. అలాగే అందానికి నిలువుటద్దంలా ఉండే శ్రీలీల వంటివారికి ఇంకాస్త చోటు ఎక్కువే ఉంటుంది. ఆమెకు ఆ చోటు ఇచ్చేందుకే.. యువ నిర్మాత ఇప్పుడిదంతా చేస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లోని ఓ ఖరీదైన హోటల్లో శ్రీలీల కోసం సూట్ రూమ్‌ని బుక్ చేసి.. దానికి రోజూ రూ. 20 వేలు రెంట్ కడుతున్నాడట. మరి రెంటే అంతుంటే.. ఇక ఇతరత్రా ఖర్చులకు ఆ నిర్మాత ఇంకెంత ఖర్చు పెడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. మరి అంతలా శ్రీలీల మత్తులో ఆ నిర్మాత ఉండటానికి కారణమేంటో? ఆ నిర్మాత ఎవరో? ఏంటో? అని మాత్రం అడగొద్దు ప్లీజ్.