జక్కన్న విజయ రహస్యం ఇదేనట!

విధాత: విజయానికి అందరూ బంధువులే…. అపజయం మాత్రం ఒంటరిది… తాజ్ మహల్‌ను కట్టించిన వారి పేరు గుర్తుంచుకుంటాం.. కానీ దాన్ని కట్టేందుకు రాళ్ళను మోసిన కూలీలను ఎవరూ పట్టించుకోరు. పల్లకిలో తిరిగే వారిని మెచ్చుకుంటారే గాని.. వాటిని మోసే వారి కష్టాన్ని ఎవ్వ‌రు చూడరు.. అది లోక స‌హ‌జం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే విజయానికైనా, అపజయానికైనా కష్టం ఒకటే. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో విజయం సాధించిన వాడు చెప్పే.. ఏ మాటకైనా విలువ ఉంటుంది. అదే […]

  • By: krs    latest    Dec 16, 2022 6:03 AM IST
జక్కన్న విజయ రహస్యం ఇదేనట!

విధాత: విజయానికి అందరూ బంధువులే…. అపజయం మాత్రం ఒంటరిది… తాజ్ మహల్‌ను కట్టించిన వారి పేరు గుర్తుంచుకుంటాం.. కానీ దాన్ని కట్టేందుకు రాళ్ళను మోసిన కూలీలను ఎవరూ పట్టించుకోరు. పల్లకిలో తిరిగే వారిని మెచ్చుకుంటారే గాని.. వాటిని మోసే వారి కష్టాన్ని ఎవ్వ‌రు చూడరు.. అది లోక స‌హ‌జం.

ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే విజయానికైనా, అపజయానికైనా కష్టం ఒకటే. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో విజయం సాధించిన వాడు చెప్పే.. ఏ మాటకైనా విలువ ఉంటుంది. అదే ఫ్లాప్ తీసి అంతకంటే ఎక్కువ కష్టపడినా.. కూడా వాడి మాటకి విలువ ఇవ్వరు. నేడు రాజమౌళి అపజయం ఎరుగని దర్శకుడు. దాంతో ఆయన దర్శకధీరుడు అయ్యాడు. ఆయన ఏం చెప్పినా అద్భుతంగా ఉంటుంది.

ఇక విషయానికొస్తే ట్రిపుల్ ఆర్ చిత్రం సృష్టిస్తున్న ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత అదే రేంజ్‌లో ఇంకా చెప్పాలంటే అంతకుమించి సునామీ సృష్టిస్తోంది. దీంతో పాటు ఈ చిత్రానికి ప్రపంచ గుర్తింపు వచ్చింది. అలా ఆర్ఆర్ఆర్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత రాజమౌళి అండ్ కోకు దక్కుతుంది.

తాజాగా 2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ కావడంతో ఈ చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవల రాజమౌళి ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విజయ రహస్యాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. విజయానికి ప్రత్యేకంగా రహస్యం ఏమీ ఉండదు. రెండు విషయాలను కచ్చితంగా పాటిస్తే విజయం తనంతట తానే మన చెంతకు చేరుతుందని అంటున్నాడు.

ప్రేక్షకులతో అనుబంధం.. కష్టపడటం.. ఈ రెండు విషయాలను మనం పాటిస్తే మనకు కచ్చితంగా విజయం లభిస్తుంది. సినిమా కమర్షియల్‌గా విజయం సాధించి ప్రేక్షక ఆదరణ పొందితే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. మనం పడ్డ కష్టమంతా ప్రేక్షకుల ఆనందంలో మనం చూస్తూ మన కష్టాన్ని మరిచిపోతాం.

మేము RRRలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కొన్ని జంతువుల లారీ‌లో నుంచి దూకే సీక్వెన్స్.. సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు మా చిత్ర యూనిట్ సభ్యులందరూ నిద్రలేని రాత్రులు గడిపారు. ఎందుకంటే అవన్నీ రాత్రి సమయాల్లోనే చిత్రీకరించవలసిన సన్నివేశాలని రాజమౌళి చమత్కారంగా హాస్యాన్ని పండించారు. ఇక మహేష్ బాబు హీరోగా రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందునున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.