Patna | ముగ్గురిని బ‌లిగొన్న‌.. 400 పాల బ‌కాయి

Patna మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం రెండు వ‌ర్గాల మ‌ధ్య కాల్పులు బీహార్‌లోని పాట్నాలో ఘ‌ట‌న‌ విధాత‌: ప‌నికిరాని చిన్న గొడ‌వ‌లు కూడా ప్రాణాలు తీస్తాయ‌న‌డానికి ఈ ఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ‌. పాల బ‌కాయి 400 రూపాయ‌ల‌ కోసం ఇరు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రొక‌రికి తీవ్రంగా బుల్లెట్ గాయాల‌య్యాయి. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని పాట్నాలో గురువారం రాత్రి జ‌రిగింది. పోలీసులు, స్థానికుల వివ‌రాల ప్రకారం.. ఫతుహా పోలీస్ […]

Patna | ముగ్గురిని బ‌లిగొన్న‌.. 400 పాల బ‌కాయి

Patna

  • మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం
  • రెండు వ‌ర్గాల మ‌ధ్య కాల్పులు
  • బీహార్‌లోని పాట్నాలో ఘ‌ట‌న‌

విధాత‌: ప‌నికిరాని చిన్న గొడ‌వ‌లు కూడా ప్రాణాలు తీస్తాయ‌న‌డానికి ఈ ఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ‌. పాల బ‌కాయి 400 రూపాయ‌ల‌ కోసం ఇరు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రొక‌రికి తీవ్రంగా బుల్లెట్ గాయాల‌య్యాయి. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని పాట్నాలో గురువారం రాత్రి జ‌రిగింది.

పోలీసులు, స్థానికుల వివ‌రాల ప్రకారం.. ఫతుహా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్గాపర్ని, యాజీపూర్ ప్రాంతాల్లో నివ‌సించే ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య రూ.400 పాల బ‌కాయి కోసం తొలుత లొల్లి మొద‌లైంది. ఒక వ‌ర్గంవారు మ‌రో వ‌ర్గం ఇంటి వ‌ద్ద‌కు వెళ్లి పాల బ‌కాయి రూ.400 చెల్లించాల‌ని డిమాండ్‌చేశారు. ఈ క్ర‌మంలో మొద‌లైన వాగ్వాదం కాస్త ఘ‌ర్ష‌ణ‌కు అనంత‌రం కాల్పుల‌కు దారితీసింది.

కాల్పుల్లో జయ్ సింగ్ (50), శైలేశ్‌ కుమార్ (35), ప్రదీప్ కుమార్ (30) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ద‌వాఖాన‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పాట్నాలోని నలంద మెడికల్ కాలేజీ ద‌వాఖాన‌కు పోలీసులు తరలించారు.

ఇరువ‌ర్గాల మ‌ధ్య ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్య‌లో పోలీసు బలగాలు మోహరించాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్న‌ద‌ని పోలీసు అధికారి వెల్ల‌డించారు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నామని, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టిన‌ట్టు పేర్కొన్నారు.