Revanth Reddy | పనితీరు ఆధారంగా టికెట్లు.. సర్వేలు చేయిస్తాం: రేవంత్‌రెడ్డి

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే బోయినపల్లిలో ఆర్‌జీఎన్‌సీ శంఖుస్థాపనకు సోనియాగాంధీ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి విధాత: నాయకుల పనితీరు ఆధారంగానే కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇస్తుందని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తేల్చి చెప్పారు. ఈ మేరకు సర్వేలు చేయిస్తామన్నారు. తాము చేపట్టిన సర్వేలలో నాయకుల పనితీరుపై నివేదికలు వస్తాయని, వాటి ఆధారంగానే పార్టీ అభ్యర్థులను నిర్ణయిస్తుందన్నారు. నాయకులంతా నిత్యం ప్రజల్లో ఉండి పని చేయాలన్నారు. ప్రజల ఆమోదం ఉంటేనే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులగా […]

  • By: krs    latest    Jun 10, 2023 9:55 AM IST
Revanth Reddy | పనితీరు ఆధారంగా టికెట్లు.. సర్వేలు చేయిస్తాం: రేవంత్‌రెడ్డి
  • వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే
  • బోయినపల్లిలో ఆర్‌జీఎన్‌సీ శంఖుస్థాపనకు సోనియాగాంధీ
  • గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి

విధాత: నాయకుల పనితీరు ఆధారంగానే కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇస్తుందని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తేల్చి చెప్పారు. ఈ మేరకు సర్వేలు చేయిస్తామన్నారు. తాము చేపట్టిన సర్వేలలో నాయకుల పనితీరుపై నివేదికలు వస్తాయని, వాటి ఆధారంగానే పార్టీ అభ్యర్థులను నిర్ణయిస్తుందన్నారు. నాయకులంతా నిత్యం ప్రజల్లో ఉండి పని చేయాలన్నారు. ప్రజల ఆమోదం ఉంటేనే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులగా బరిలో ఉంటామనే విషయాన్ని గుర్తించాలని నేతలకు రేవంత్‌ సూచించారు.

ఈ మేరకు శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రెటరీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, నదీమ్ జావిద్ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రెటరీలందరూ తాము ఇంఛార్జీలుగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతీ 15రోజులకు ఒక నివేదిక పంపించాలని ఆదేశించారు. పార్టీకి రాబోయే ఆరునెలలు కీలకమని నేతలు, కార్యకర్తలు అందరూ ఈ ఆరునెలలు కష్టపడి పనిచేయాలని కోరారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతున్నదన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేసినవారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని తెలిపారు.

ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజుగారే ఉదాహరణ అని అన్నారు. ఈ సమావేశంలో రేవంత్‌ రెడ్డి నాలుగు తీర్మాణాలు ప్రవేశ పెట్టగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఏఐసీసీ సెక్రెటరీలు నియమించబడిన బోసురాజు, నదీమ్ జావీద్ లను అభినందించారు. అలాగే కొత్తగా నియమితులైన సెక్రెటరీలకు అబినందించారు. బోయినపల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంఖుస్థాపనకు సోనియాగాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. సీఎల్పీ నాయకుడు భట్టివిక్రమార్క పాదయాత్ర 1000 కి.మీ. పూర్తయిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు తీర్మానం చేశారు. అనంతరం భట్టి పాదయాత్ర వేయి కిలో మీటర్లుపూర్తయిన సందర్భంగా గాంధీభవన్‌లో కేక్‌ కట్‌ చేశారు.

కేసీఆర్‌ తన పేపర్‌, చానల్స్ లో అబద్దాలు ప్రచారం చేసుకుంటున్నాడు- ఠాక్రే

కేసీఆర్ రోజు ప్రజలకు అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ఏఐసీసీ ఇంచార్జీ మానిక్‌రావ్‌ ఠాక్రే ఆరోపించారు. కేసీఆర్‌.. తనకు పేపర్, చానల్స్ ఉన్నాయని, వాటిల్లో ప్రతి రోజు తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రోజు ఒక వర్గానికి ఏవో ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని, ఇవన్నీ పచ్చి అబద్దాలన్నారు. వాటన్నింటిని మీరు అవగాహన చేసుకొని వాస్తవాలను జనంలోకి తీసుకు పోవాలన్నారు. ప్రజలకు అర్థం అయ్యే విదంగా, గట్టిగా వాస్తవాలను ప్రచారం చెయ్యాలని తెలిపారు.

మన నాయకులు, కార్యకర్తలు అందరూ నిత్యం జనంలోనే ఉండాలని సూచించారు. ప్రజలకు కేసీఆర్ చెప్తున్న అబద్దాలను వివరిస్తూనే, మనం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా చాలా స్పష్టంగా చెప్పాలన్నారు. ఈ మేరకు నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలని మానిక్‌ రావ్‌ ఠాక్రే కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది మన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మనం కష్టపడితే అధికారం మనకే దక్కుతుందన్నారు. తెలంగాణ లో ఎన్నికల వాతావరణం వచ్చేసిందన్నారు.