వేటలో పులి ఎత్తుగడ.. చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్
Tiger attack | ఆకలితో ఉన్న పులులు జంతువులను వెంటాడి, వేటాడి చంపేస్తాయి. ఆ తర్వాత తమ ఆకలిని తీర్చుకుంటాయి. ఇలాంటి కొన్ని సందర్భాల్లో జంతువులు పులుల దాడి నుంచి తప్పించుకుంటాయి. అయితే ఓ పులి మాత్రం నీలి జింకను వేటాడేందుకు సరికొత్త ఎత్తుగడ వేసింది. నక్క తెలివిని ప్రదర్శించింది. జుట్టు ఊడిపోతుందా.. ఎందువల్ల అంటే! గడ్డి మేస్తున్న జింకపై దాడి చేసేందుకు పులి కాసేపు దాగుడుమూతల ఆట ఆడింది. జింక కళ్లుగప్పి దాడి చేయాలనుకుంది. అందులో […]

Tiger attack | ఆకలితో ఉన్న పులులు జంతువులను వెంటాడి, వేటాడి చంపేస్తాయి. ఆ తర్వాత తమ ఆకలిని తీర్చుకుంటాయి. ఇలాంటి కొన్ని సందర్భాల్లో జంతువులు పులుల దాడి నుంచి తప్పించుకుంటాయి. అయితే ఓ పులి మాత్రం నీలి జింకను వేటాడేందుకు సరికొత్త ఎత్తుగడ వేసింది. నక్క తెలివిని ప్రదర్శించింది.
గడ్డి మేస్తున్న జింకపై దాడి చేసేందుకు పులి కాసేపు దాగుడుమూతల ఆట ఆడింది. జింక కళ్లుగప్పి దాడి చేయాలనుకుంది. అందులో భాగంగా జింక తలెత్తి పైకి చూసినప్పుడల్లా పులి తెలివిగా నేలపై పడుకుంది. ఓ విగ్రహం మాదిరి ఉండిపోయింది. చివరకు పులి దాడిని పసిగట్టిన జింక అడవిలోకి పారిపోయింది.
ఈ దృశ్యం మధ్యప్రదేశ్ లోని సాత్పూరా జాతీయ పార్కులో ఆవిష్కృతమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియోను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రాజేశ్ స్నాప్ ఆదివారం ఉదయం తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.