Tilak Varma: కరేబీయన్ గడ్డపై తెలుగోడి సత్తా.. రెండో టీ20లోను నిరాశపరచిన భారత్
Tilak Varma: ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై అట్లర్ ఫ్లాప్ అయిన ఆ జట్టులో అద్భుతంగా ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు తిలక్ వర్మ. వెస్టిండీస్ టూర్‌తో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన తిలక్.. రికార్డుల మోత మోగిస్తున్నాడు.. మొదటి టీ20 మ్యాచ్‌లో 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన తిలక్ వర్మ, 20 ఏళ్ల వయసులో ఒకే టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు క్రియేట్ […]

Tilak Varma: ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై అట్లర్ ఫ్లాప్ అయిన ఆ జట్టులో అద్భుతంగా ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు తిలక్ వర్మ. వెస్టిండీస్ టూర్‌తో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన తిలక్.. రికార్డుల మోత మోగిస్తున్నాడు.. మొదటి టీ20 మ్యాచ్‌లో 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన తిలక్ వర్మ, 20 ఏళ్ల వయసులో ఒకే టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు… ఇక రెండో టీ 20లో 39 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ నమోదు చేసి భారత్ గౌరవప్రదమైన స్కోరు అందుకునేలా చేశాడు. రోహిత్ శర్మ వయసు 20 ఏళ్ల 143 రోజులు వయస్సులో టీమిండియా తరుపున టీ20 హాఫ్ సెంచరీ చేయగా, ఇప్పుడు తిలక్ వర్మ 20 ఏళ్ల 271 రోజులు వయస్సులో అరుదైన ఘనత సాధించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 152 పరుగులు చేసింది. శుభమన్ గిల్ రెండో టీ20లోను నిరాశపరిచాడు. 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక 3 బంతుల్లో 1 పరుగు చేసిన సూర్యకుమార్ యాదవ్, రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ ( 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు) చేసి రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సంజూ శాంసన్(7 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంపౌట్ అయ్యాడు. ఇక 18 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యాని అల్జెరీ జోసఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. చివరలో రవిబిష్ణోయ్ సిక్సర్‌తో టీమిండియా స్కోరు బోర్డును 150 దాటించాడు.
152 పరుగుల స్కోరు చేసిన టీమిండియా, ఆ స్కోరుని కాపాడుకోవడంలో దారుణంగా విఫలం అయింది. విండీస్ జట్టు 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన అకీల్ హుస్సేన్ అద్భుతంగా ఆడి విండీస్‌కి మంచి విజయాన్ని అందించాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసిన నికోలస్ పూరన్ మరోసారి విండీస్ విజయంలో కీలకం అయ్యాడు. అయితే విండీస్ హిట్టర్ సిమ్రాన్ హెట్మయర్( 22 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు) మరోసారి నిరాశపరిచాడు. అంతా విండీస్ ఓడిపోతుందని భావించగా, ఆ జట్టు మాత్రం కలిసికట్టుగా ఆడి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో విండీస్ జట్టు 2-0తో ముందుంది