CM Jagan | ఏపి జగన్ జోరు.. YCPకి 24-25 ఎంపీ సీట్లు! టైమ్స్ నౌ సర్వేలో వెళ్లడి
CM Jagan | విధాత: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వైయస్ జగన్ అధికారంలోకి వస్తారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా సీట్లు దక్కించుకుంటుంది అని జాతీయ స్థాయి మీడియా సంస్థ టైమ్స్ నౌ పేర్కొంది. జగన్ ఓట్ల శాతం పెరిగిందని, ఆ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 24- 25 లోక్ సభ సీట్లు సాధిస్తుందని ఆ సంస్థ చెబుతోంది. గత ఎన్నికల్లో, అంటే 2019 ఎన్నికల్లో 49. […]

CM Jagan |
విధాత: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వైయస్ జగన్ అధికారంలోకి వస్తారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా సీట్లు దక్కించుకుంటుంది అని జాతీయ స్థాయి మీడియా సంస్థ టైమ్స్ నౌ పేర్కొంది. జగన్ ఓట్ల శాతం పెరిగిందని, ఆ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది.
2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 24- 25 లోక్ సభ సీట్లు సాధిస్తుందని ఆ సంస్థ చెబుతోంది. గత ఎన్నికల్లో, అంటే 2019 ఎన్నికల్లో 49. 8 శాతం ఓట్ల షేర్ సాధించిన జగన్ మోహన్ రెడ్డి 22 లోక్ సభ స్థానాలు సాధించారు.
అయితే ఈ నాలుగేళ్ళ పాలనలో అయన మరింత ప్రజాభిమానం చూరగొని ఓట్ల శాతాన్ని 51. 3 శాతానికి పెంచుకున్నట్లు, ఈ క్రమంలోనే లోక్ సభ స్థానాలు సైతం 24 – 25 రావచ్చని ఆ సర్వ్ వెల్లడిస్తోంది.
తెలంగాణలో 38.4 శాతం ఓట్లతో 9- 11 సీట్లు వస్తాయని సర్వే చెబుతోంది. ఎన్డీయే, బిజెపికి తెలంగాణలో రెండు మూడు లోక్ సభ సీట్లు వస్తాయని సర్వే చెబుతోంది.