కేసీఆర్ కు మద్యం షాపులపైనే శ్రద్ధ: తీన్మార్ మల్లన్న

సీఎం కేసీఆర్ కు మద్యం షాపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, మద్యం షాపులకు రెండు నెలల ముందే టెండర్ పిలిచిన కేసీఆర్.. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ముందుగానే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు

  • By: Somu    latest    Nov 28, 2023 12:23 PM IST
కేసీఆర్ కు మద్యం షాపులపైనే శ్రద్ధ: తీన్మార్ మల్లన్న
  • వైన్ షాపులు 10 గంటలకే ఓపెన్
  • నల్ల నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియదు?
  • కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: సీఎం కేసీఆర్ కు మద్యం షాపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, మద్యం షాపులకు రెండు నెలల ముందే టెండర్ పిలిచిన కేసీఆర్.. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ముందుగానే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి మద్దతుగా మంగళవారం ఆయన రోడ్ షో లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.


కేసీఆర్, బాల్క సుమన్ పదేళ్లుగా తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రూ.2000 పింఛన్ ఎక్కడినుండి ఇస్తుందని అంటున్నారు.. పదేళ్ల నుండి అక్రమంగా ప్రజల సొమ్ము తిన్న కేసీఆర్ నుండి సొమ్ము కక్కించి పెన్షన్ ఇస్తామని పేర్కొన్నారు. ఇంటింటికి నల్ల నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్.. ఇంటింటికి నల్ల నీళ్లు వస్తున్నాయా? అని ప్రజలను అడిగారు. రావట్లేదని ప్రజలు చెప్పడంతో కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని పేర్కొన్నారు. వైన్ షాపులు 10 గంటలకే ఓపెన్ అవుతాయని, నల్లనీళ్లు ఎప్పుడొస్తాయో తెలియదన్నారు.