కర్ణాటక: వివాదంలో ‘టిప్పు సుల్తాన్’ సలాం హారతి
సలాం హారతి పేరును హారతి నమస్కారంగా మారుస్తున్న కర్ణాటక ప్రభుత్వం మంచిని గౌరవించని తనం ఎవరికీ మంచిది కాదంటున్న మేధావులు విధాత: ముస్లిం వ్యతిరేకతే తమ మనుగడ అన్న తీరుగా ప్రవర్తించటం బీజేపీకి కొత్త కాదు. అందుకోసం అందివచ్చిన ఏ అవకాశాన్నీ సంఘ్ పరివార్ శక్తులు వదులు కోవటం లేదు. ఇంకా చెప్పాలంటే.. మధ్య యుగాల నుంచి ముస్లిం పాలకులు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, వార సత్వ సంపదను నాశనం చేశారని అంటూ…, ఇప్పుడు దానికి బదులు […]

సలాం హారతి పేరును హారతి నమస్కారంగా మారుస్తున్న కర్ణాటక ప్రభుత్వం
మంచిని గౌరవించని తనం ఎవరికీ మంచిది కాదంటున్న మేధావులు
విధాత: ముస్లిం వ్యతిరేకతే తమ మనుగడ అన్న తీరుగా ప్రవర్తించటం బీజేపీకి కొత్త కాదు. అందుకోసం అందివచ్చిన ఏ అవకాశాన్నీ సంఘ్ పరివార్ శక్తులు వదులు కోవటం లేదు. ఇంకా చెప్పాలంటే.. మధ్య యుగాల నుంచి ముస్లిం పాలకులు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, వార సత్వ సంపదను నాశనం చేశారని అంటూ…, ఇప్పుడు దానికి బదులు తీర్చుకోవాలని చెప్తుంటారు. ఆ క్రమంలోనే తమ ఆధిపత్య, అమానవీయ చర్యలను సమర్థించుకొంటారు.
ముస్లిం పాలకులు ఈ సమాజానికి ఏ రూపంలో మంచి చేసినా దాన్ని ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉండరు. నాటి పాలకుల సమాజ హిత మంచి చిహ్నాలు ఇప్పటికీ ఏమైనా మిగిలి ఉంటే అలాంటి వాటిని నామ రూపాలు లేకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నారు. లేదా అలాంటి వాటికి పేరు మార్చి తమదిగా చాటుకోవటానికి ఉబలాట పడుతున్నారు.
తాజాగా ఈ కోవలోనే కర్ణాటకలో సలాం హారతి వివాదం వార్తల్లోకి ఎక్కింది. సలాం హారతి పేరిట కర్ణాటక రాష్ట్రంలోని దేవాలయాల్లో పూజా నిర్వహణ కార్యక్రమం ఎప్పటినుంచో అమలులో ఉన్నది. అది టిప్పు సుల్తాన్ కాలంలో హిందూ దేవాలయాల్లో ప్రవేశ పెట్టినదిగా ప్రచారంలో ఉన్నది.
ఒక ముస్లిం పాలకుడు హిందూ దేవాలయాల్లో ప్రవేశ పెట్టిన పూజా కార్యక్రమం ఇంకా ఉంటుందా.. అని కర్ణాటక ప్రభుత్వం తలంచింది. సలాం హారతిని హారతి నమస్కారంగా మారుస్తున్నట్లు ‘కర్ణాటక హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్’ మంత్రి శశికళ జోలె ప్రకటించటం చర్చనీయాంశం అవుతున్నది.
సర్వ మత సమ భావన అనేదే గిట్టని బీజేపీ నేతలు ఇంతకంటే ఏం చేయగలరని లౌకిక ప్రజాస్వామ్య వాదులు విమర్శిస్తున్నారు. మంచిని గౌరవించలేని తనం ఎవరికీ మంచిది కాదని అంటున్నారు. కొన్ని నిర్మాణాలను కూల్చటం, ద్వంసం చేయటం, నగరాలు-ఆలయాల పేర్లు మార్చటం ద్వారా ఒక చారిత్రక ఔన్నత్యాన్నీ సారాన్నీ మార్చలేరని అంటున్నారు.