Assembly | తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు.. ఈటల, కేటీఆర్‌ల అప్యాయ కౌగిలింత

Assembly ఈటెల, కేటీఆర్‌ల అప్యాయ కౌగిలింత కేటీఆర్, జగ్గారెడ్డిల మాటామంతి ప్రభుత్వ మాస్టర్ స్ట్రోక్ తో విపక్షాలు విలవిల అంటు హరీశ్ చిట్‌చాట్‌ మేడ్చల్ అభ్యర్థులను నేనే నిర్ణయిస్తానంటూ మల్లారెడ్డి చిట్‌చాట్‌ విధాత, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం రోజున పలు ఆసక్తికర సన్నివేశాలకు వేదికయ్యాయి. సభా ప్రారంభంకాగానే మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకోగా ఒకరినొకరు హత్తుకున్నారు. పది నిమిషాల పాటు ఇరువురు […]

  • Publish Date - August 3, 2023 / 11:02 AM IST

Assembly

  • ఈటెల, కేటీఆర్‌ల అప్యాయ కౌగిలింత
  • కేటీఆర్, జగ్గారెడ్డిల మాటామంతి
  • ప్రభుత్వ మాస్టర్ స్ట్రోక్ తో విపక్షాలు విలవిల అంటు హరీశ్ చిట్‌చాట్‌
  • మేడ్చల్ అభ్యర్థులను నేనే నిర్ణయిస్తానంటూ మల్లారెడ్డి చిట్‌చాట్‌

విధాత, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం రోజున పలు ఆసక్తికర సన్నివేశాలకు వేదికయ్యాయి. సభా ప్రారంభంకాగానే మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకోగా ఒకరినొకరు హత్తుకున్నారు. పది నిమిషాల పాటు ఇరువురు మాట్లాడుకోవడం ఇతర సభ్యులు ఆసక్తిగా తిలకించారు. అ తర్వాతా అసెంబ్లీ వెలుపల కేటీఆర్ , కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డిల మధ్య సరదా సంభాషణ సాగింది.

టీ.షర్ట్‌లో వచ్చిన జగ్గారెడ్డిని పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లా అన్న కేటీఆర్ అనగా, బదులుగా టీ షర్ట్ వేసుకుంటే పిల్లలయిపోతారా అంటు జగ్గారెడ్డి ప్రశ్నించారు. జగ్గారెడ్డి వెంట ఉన్న టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్‌ను చూసిన కేటీఆర్ మీ ఇద్దరికి దోస్తానా ఎక్కడ కుదిరిందింటు అడిగారు. దీంతో మాది ఒకే కంచం..ఒకే మంచమని మామిళ్ల చెప్పగా, అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తావా అని కేటీఆర్ ప్రశ్నించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తా, మన దగ్గరకు పట్టుకొస్తా అంటు మామిళ్ల సరదాగా వ్యాఖ్యానించారు.

మరోవైపు మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ మాట్లాడుతు ప్రభుత్వం వరుస సంక్షేమ పథకాల ప్రకటనతో ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్‌తో ప్రతిపక్షాలు గిలగిల కొట్టుకుంటున్నాయంటు వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనం, వీఆర్‌ఏల సర్ధుబాటుపై ప్రభుత్వ నిర్ణయాలు విపక్షాలు ఉహించలేదన్నారు. కేసీఆర్ నిర్ణయాలతో ప్రతిపక్షాల వాయిస్ డౌన్ అయ్యిందంటు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ హామీల వరుస హామీల అమలు నిర్ణయం విపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ వంటిదని, ఇదే తరహాలో సభాలో విపక్షాలను కడిగిపారేస్తామన్నారు. అసెంబ్లీ వేదికగా ఉద్యోగుల ఐఆర్‌తో పాటు పీఆర్సీ ప్రకటన చేస్తామన్నారు.

ఇంకోవైపు మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌ల మేడ్చల్ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్ధిగా ఉండాలో తానే నిర్ణయిస్తానంటు సంచలన కామెంట్లు చేశారు. తన మేడ్చల్ అసెంబ్లీ టికెట్ల చర్చపై ఆయన స్పందిస్తు.. గత ఎన్నికల్లో కెఎల్‌ఆర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించింది తానేనన్నారు. కాంగ్రెస్ అధిష్టానంలో తనకు మిత్రులున్నారన్నారు. మేడ్చల్ కాంగ్రెస్‌లో గ్రూపు తగదాలను నేనే సృష్టిస్తున్నానన్నారు. ఐటీ అధికారుల దాడుల్లో తన ఇంట్లో డబ్బులున్న గది చూడలేదని, ఆ డబ్బునే ఎన్నికలకు ఖర్చు చేసున్నానన్నారు. కాంగెస్‌, బీజేపీల వద్ద డబుల్ బెడ్ రూమ్ అంశం తప్ప మరోకటి లేదన్నారు.

రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తర్వాతా నా గ్రాఫ్ పెరిగిందన్నారు. తాను చేసిన అభివృద్ధిని ప్రజలు మరిచి ప్రతిపక్షాల రెచ్చగొట్టే మాటలే వింటున్నారన్నారు. కావాలనే కొంతమంది మీడియా తనపై రాజకీయంగా అసత్య ప్రచారం చేస్తున్నారని, త్వరలనే తాను సొంతంగా మీడియా సంస్థ ఏర్పాటు చేస్తానని, తెలంగాణ యాసభాషలో ఏడాది నాలుగు సినీమాలు తీస్తానన్నారు. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలంటు ముక్తాయింపునిచ్చారు.

Latest News