Tomato | సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను మించి ఆదాయం.. ఏపీ టమాటా రైతుకు నెల రోజుల్లో రూ.3 కోట్లు
Tomato విధాత: మొన్న తెలంగాణ రైతు మహిపాల్ రెడ్డి టమాటా సాగుచేసి కోటి పాతిక లక్షలు ఆర్జించిన విషయం మరువక ముందే ఇప్పుడు ఇంకో రైతు ఏకంగా మూడు కోట్లు సంపాదించి ఆయన రికార్ట్ బ్రేక్ చేశాడు. కాలం కలిసొచ్చి ధరలు బాగుంటే రైతుల ఆదాయం సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోదని ఇంకోమారు రుజువైంది. ఏపీకి చెందిన మరో రైతు టమాటా విక్రయం ద్వారా నెల రోజుల్లోనే ఏకంగా రూ.3 కోట్ల ఆదాయం గడించాడు. చిత్తూరు […]

Tomato
విధాత: మొన్న తెలంగాణ రైతు మహిపాల్ రెడ్డి టమాటా సాగుచేసి కోటి పాతిక లక్షలు ఆర్జించిన విషయం మరువక ముందే ఇప్పుడు ఇంకో రైతు ఏకంగా మూడు కోట్లు సంపాదించి ఆయన రికార్ట్ బ్రేక్ చేశాడు. కాలం కలిసొచ్చి ధరలు బాగుంటే రైతుల ఆదాయం సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోదని ఇంకోమారు రుజువైంది.
ఏపీకి చెందిన మరో రైతు టమాటా విక్రయం ద్వారా నెల రోజుల్లోనే ఏకంగా రూ.3 కోట్ల ఆదాయం గడించాడు. చిత్తూరు జిల్లాకు చెందిన సోమల మండలానికి చెందిన చంద్రమౌళి కరకమందలో గ్రామంలో 12 ఎకరాలు, పులిచెల్ల మండలంలో 20 ఎకరాల పొలంలో టమాటా పంట సాగు చేస్తున్నాడు.
ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతుంది. ఈ క్రమంలో చంద్రమౌళి తన 22 ఎకరాల్లో టమాటా సాగు చేయడంతో అది ఇప్పుడు బంగారు పంటగా మారింది.
40 వేల పెట్టెలను విక్రయించగా రూ.4 కోట్ల ఆదాయాం వచ్చిందని, పెట్టుబడి రూ.70 లక్షలు, కమిషన్‌గా 20 లక్షలు, రవాణా ఖర్చలు 10 లక్షలు పోను.. చేతికి రూ.3 కోట్లు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశాడు చంద్రమౌళి.
తాను గత ఇరవయ్యేళ్ళుగా టమాటా సాగు చేస్తున్నానని, ఈ స్థాయి ఆదాయం ఎన్నడూ రాలేదని అన్నారు. కొన్ని సార్లు పంట అమ్ముడుపోక, అమ్ముడైనా ధర లేక గేదెలకు వేసిన రోజులు చూసిన రైతులు ఇప్పుడు బ్రహ్మాండమైన ఆదాయం కళ్లజూస్తున్నారు.