Train Accident | ఇది మోదీ పాపం!

Train Accident రైలు మార్గాల్లో యాంటి కొల్లిజన్‌ టెక్నాలజీ మమత హయాంలోనే టీసీఏఎస్‌ అభివృద్ధి ‘కవచ్‌’ అని పేరు మార్చిన మోదీ సర్కారు 2019 వరకు కవచ్‌ ఇన్‌స్టాలేషన్‌లో నిర్లక్ష్యం దేశంలో మొత్తం రైల్వే మార్గం 68,043 కి.మీ. ‘కవచ్‌’ ఇన్‌స్టాల్‌ చేసింది 1,445 కి.మీ.కే మొత్తం మార్గంలో 2 శాతానికే భద్రత ఇదీ మోదీ సర్కారు నేరపూరిత నిర్లక్ష్యం 288కి చేరిన ప్రమాద మృతుల సంఖ్య.. చావుబతుకుల్లో మరో 800 మంది ఈ నెత్తురు మోదీ, […]

Train Accident | ఇది మోదీ పాపం!

Train Accident

  • రైలు మార్గాల్లో యాంటి కొల్లిజన్‌ టెక్నాలజీ
  • మమత హయాంలోనే టీసీఏఎస్‌ అభివృద్ధి
  • ‘కవచ్‌’ అని పేరు మార్చిన మోదీ సర్కారు
  • 2019 వరకు కవచ్‌ ఇన్‌స్టాలేషన్‌లో నిర్లక్ష్యం
  • దేశంలో మొత్తం రైల్వే మార్గం 68,043 కి.మీ.
  • ‘కవచ్‌’ ఇన్‌స్టాల్‌ చేసింది 1,445 కి.మీ.కే
  • మొత్తం మార్గంలో 2 శాతానికే భద్రత
  • ఇదీ మోదీ సర్కారు నేరపూరిత నిర్లక్ష్యం
  • 288కి చేరిన ప్రమాద మృతుల సంఖ్య..
  • చావుబతుకుల్లో మరో 800 మంది
  • ఈ నెత్తురు మోదీ, బీజేపీ చేతులకు అంటింది
  • సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిన నిరసనలు

విధాత: ప్రభుత్వాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులు.. ప్రజలకు సంకటంగా మారుతుంటాయనేదుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది ఒడిశాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఘటనలో 288 మంది చనిపోగా.. 803 మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదానికి కారణమైన రైలు.. లూప్‌లైన్‌లోకి వెళ్లడం వల్లే ఘోరం జరిగిందని అధికారులు ప్రాథమికంగా ఒక నిర్థారణకు వచ్చారు. 130 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు మెయిన్‌ లైన్‌లోకి వెళ్లేందుకు స్టేషన్‌ మాస్టర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే.. సిగ్నల్‌ను మళ్లీ వెనక్కు తీసుకోవడంతో కోరమాండల్‌ లూప్‌లైన్‌లోకి ప్రవేశించింది.

అప్పటికే అక్కడ ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొన్నది. ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌ గూడ్స్‌ రైలు పైకి ఎక్కగా.. కొన్న బోగీలు పక్కన ట్రాక్‌పై పడ్డాయి. అదే స‌మ‌యంలో అదే ట్రాక్‌ పైకి వేగంగా దూసుకొచ్చిన బెంగ‌ళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్‌.. కోరమండ‌ల్ బోగీల‌ను ఢీకొట్టింది. ఇదంతా 15 నిమిషాల వ్యవధిలో జ‌రిగిపోయింది. ఫలితం.. మూడు వందల ప్రాణాలు బలి. ఈ ప్రమాదం వెనుక తక్షణ బాధ్యులెవరన్నది తేలాల్సి ఉన్నది. కానీ.. దీర్ఘకాలికంగా రైల్వే రక్షణ వ్యవస్థను నిర్లక్ష్యం చేసిన దోషి మాత్రం కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారే అని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు.

మోదీ సర్కారు రైళ్లు ఢీకొనకుండా ఆపే టెక్నాలజీని విస్తరించడంలో నేరపూరితంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని అంటున్నారు. వాస్తవానికి 2011-12లో మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ‘ట్రెయిన్‌ కొల్లిజన్‌ అవాయిడెన్స్‌ సిస్టమ్‌ (సీసీఏఎస్‌)ను అభివృద్ధి చేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్రెడిట్‌ తమకే దక్కాలన్న యోచనలో దానికి తమదైన శైలిలో పునఃనామకరణ చేసి.. కవచ్‌ అని పేరు పెట్టారు. అయితే.. ఈ కీలకమైన భద్రతా సాంకేతికతను అమలు చేయడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం జరిగిందనడంలో సందేహం లేదు. ‘కవచ్‌’ సాంకేతిక వ్యవస్థను తయారు చేసి.. ఇన్‌స్టాల్‌ చేసేందుకు మూడు కంపెనీలను ఎంపిక చేసినా.. 2019 వరకు అది పట్టాలెక్కింది లేదు.

భారతీయ రైల్వేల మార్గం 68,043 కిలోమీటర్లు ఉన్నది. ఇందులో ‘కవచ్‌’ ఇన్‌స్టాల్‌ చేసింది 1,445 కిలోమీటర్ల మార్గానికి మాత్రమే. సరిగ్గా చెప్పాలంటే మొత్తం రైలు మార్గంలో 2శాతం మాత్రమే ‘కవచం’ పొందింది. ఇదీ మోదీ సర్కారు ఘనత! అంటే 98 శాతం మార్గంలో ఎలాంటి రక్షణ లేకుండానే రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఘటన జరిగిన ప్రాంతంలో కవచ్‌ సిస్టమ్‌ లేదని అధికారులు సైతం ధృవీకరించారు.

రక్షణ లేకుండానే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు రైళ్ల వేగం పెంచి.. నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే ఉద్దేశంతో కేంద్రం హడావుడిగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను రంగంలోకి తెచ్చింది. వాటిని ప్రారంభించే బాధ్యతను మోదీ గుండుగుత్తగా తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నయి. అసలు రైల్వేలకు ఒక శాఖ ఉన్నదా? ఉంటే దానికి మంత్రి ఉన్నారా? ఉంటే ఆ మంత్రి పేరు ఏంటి? అనే సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి ఉన్నది. రైళ్లకు సంబంధించి ఏ కార్యక్రమాన్నయినా ప్రారంభించేది మోదీయే అన్నట్టు తయారైంది. రైళ్లను ప్రారంభించి ఫొటోలకు పోజులు ఇవ్వడంలో ఉన్న ఆసక్తి ఆ రైళ్లు ప్రయాణించే మార్గాల్లో భద్రత కల్పించేందుకు ఎక్కడ పోయిందన్న విమర్శలు వస్తున్నాయి.

రైళ్లు ఢీకొనకుండా నిరోధించే సాంకేతిక 98శాతం మార్గంలో లేని సమయంలో ఈ వందే భారత్‌ హైస్పీడ్‌ రైళ్లు నడుస్తున్నాయి. బాలాసోర్‌ సమీపాన చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం ఈ మార్గంలో ‘కవచ్‌’ను ఏర్పాటు చేసి ఉంటే కచ్చితంగా నిరోధించగలిగినదే. మరి ఈ పాపం ఎవరిది?

రోజూ ఘోర ప్రమాదాలు జరుగుతాయా? అంటే జరుగకపోవచ్చు. కానీ.. ఘోర ప్రమాదం అనేది చోటు చేసుకుంటే ఒక్కరాత్రి 300 మంది ప్రాణాలు తీసిన దుర్ఘటనల్లాంటివి చోటు చేసుకుంటాయి. కాబట్టే ఇటువంటి సాంకేతికతలను యుద్ధ ప్రాతిపదికనే చేపట్టాల్సి ఉన్నా.. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభాల మోజులో ఉన్న కేంద్రంలోని బీజేపీ సర్కారుకు అది పట్టలేదు.

నిస్సందేహంగా ఆ మూడు వందల మంది రక్తం ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వం, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేతులకు అంటుకున్నదనే విమర్శలు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్నాయి. 2012 నాటికే అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించడంలో చూపిన నేరపూరిత నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమైందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అశ్వినీ వైష్ణవ్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మ సాక్షి అనేది ఉంటే ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలని అనేక మంది కోరుతున్నారు.

రైలు పట్టాలు తప్పిన సమయంలో నేను నిద్ర పోతున్నా. ఉన్నట్టుండి నాపై పది పదిహేను మంది పడటంతో మెలకువ వచ్చింది. బోగీ నుంచి బయటపడి చూస్తే.. అంతా శరీరభాగాలు చిందరవందరగా పడి ఉన్నాయి. కాళ్లు ఒక చోట.. చేతులు ఒక చోట.. ముఖం గుర్తు పట్టలేని స్థితిలో నుజ్జునుజ్జయిపోయిన తల భాగాలు.. చిమ్మినట్టు రక్తం కనిపించాయి’. – ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి చెప్పిన మాట