ఓరి మీ ఏశాలూ.. జడ్జీల బదిలీ.. టీడీపీ ఆవేదన.. ధర్నా!
విధాత: బాగా పని చేసే అధికారులు బదిలీ అయినపుడు ప్రజలు బాధ పడుతూ వారిని ఇంకా అక్కడే కొనసాగించాలంటూ ధర్నాలు చేయడం సహజం.. ఉపాధ్యాయులతో అనుబంధాన్ని వదులుకోలేక వారి బదిలీ టైములో పిల్లలు ఏడవడం.. బాధ పడడం చూశాం.. ఇప్పటికీ అక్కడక్కడ చస్తూనే ఉన్నాం. కానీ దేశంలోనే బహుశా తొలిసారి కావచ్చు ఏపీ హైకోర్టులోని ఇద్దరు జడ్జీలు బదిలీ అవ్వడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం ధర్నా చేసింది. కోర్టులను తమకు అనుబంధ సంస్థలుగా ఆన్వయించుకున్నారో ఏమో గానీ తెలుగుదేశం […]

విధాత: బాగా పని చేసే అధికారులు బదిలీ అయినపుడు ప్రజలు బాధ పడుతూ వారిని ఇంకా అక్కడే కొనసాగించాలంటూ ధర్నాలు చేయడం సహజం.. ఉపాధ్యాయులతో అనుబంధాన్ని వదులుకోలేక వారి బదిలీ టైములో పిల్లలు ఏడవడం.. బాధ పడడం చూశాం.. ఇప్పటికీ అక్కడక్కడ చస్తూనే ఉన్నాం.
కానీ దేశంలోనే బహుశా తొలిసారి కావచ్చు ఏపీ హైకోర్టులోని ఇద్దరు జడ్జీలు బదిలీ అవ్వడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం ధర్నా చేసింది. కోర్టులను తమకు అనుబంధ సంస్థలుగా ఆన్వయించుకున్నారో ఏమో గానీ తెలుగుదేశం లీగల్ సెల్ వాళ్ళు పాపం చాలా బాధ పడ్డారు.
తాజాగా.. ఏపీ హై కోర్టు నుంచి జస్టిస్ బట్టు దేవానందం మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ రమేశ్‌ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఉత్తర్వులు ఇచ్చింది. వీరి బదిలీలపై తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఏకంగా ఏపీ హైకోర్టు ఆవరణలో నిరసన చేపట్టింది.
వాస్తవానికి కోర్టుల్లోని జడ్జీల నియామకాలు, బదిలీలు పదోన్నతులు మొత్తం కొలీజియం చేతిలో ఉంటుంది తప్ప అందులో రాజకీయ ప్రమేయం ప్రత్యక్షంగా ఉండదన్నది అందరికి తెలిసిందే.. కానీ తెలుగు దేశం లీగల్ సెల్ కార్యకర్తలు, అంటే వాళ్ళు కూడా న్యాయవాదులే కానీ ధర్నా చేశారు.
ఈ బదిలీలకు ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వమే కారణం అంటూ వారు ఆరోపించడాన్ని బట్టి చూస్తుంటే తమకు ఆయా జడ్జీలు అనుకూలంగా ఉన్నారని ఓపెన్‌గా ఒప్పుకోవడమే అవుతుంది. ఏపీ హైకోర్టుకు సంబంధించి లాయర్ల సంఘం నుంచి ఏవేవో తీర్మానాలు కూడా ప్రవేశ పెట్టి జడ్జిల బదిలీలను ఖండించారు!