ప్రభుత్వ లక్ష్యాలను సాధించుటకు..ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలి: ట్రెసా

విధాత‌, జనగాం: ఇటీవల ప్రజావాణిలో జిల్లా కలెక్టరును కలిసి జనగామ ఆర్డీవో మధుమోహన్ తనను అవమాన పరుస్తున్నారని జనగామ మున్సిపల్ కమీషనర్ రజిత కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనపై కొంతమంది నిజానిజాలు తెలుసుకోకుండా ఉద్యోగులు, శాఖల మధ్య దూరం పెంచే విధంగా మాట్లాడడం సరికాదని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అభిప్రాయపడింది. ఉద్యోగులంతా ఐక్యమత్యంగా పని చేస్తేనే ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కారం అవుతాయని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో పని […]

  • By: krs    latest    Dec 07, 2022 4:22 PM IST
ప్రభుత్వ లక్ష్యాలను సాధించుటకు..ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలి: ట్రెసా

విధాత‌, జనగాం: ఇటీవల ప్రజావాణిలో జిల్లా కలెక్టరును కలిసి జనగామ ఆర్డీవో మధుమోహన్ తనను అవమాన పరుస్తున్నారని జనగామ మున్సిపల్ కమీషనర్ రజిత కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనపై కొంతమంది నిజానిజాలు తెలుసుకోకుండా ఉద్యోగులు, శాఖల మధ్య దూరం పెంచే విధంగా మాట్లాడడం సరికాదని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అభిప్రాయపడింది.

ఉద్యోగులంతా ఐక్యమత్యంగా పని చేస్తేనే ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కారం అవుతాయని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలని ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో కోరారు.

విధి నిర్వహణలో భాగంగానే నిబంధనల ప్రకారం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జనగామ ఆర్డీవో మధుమోహన్ తన డివిజన్లో ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేస్తున్నారని, జనగాం మున్సిపల్ టాస్క్ ఫోర్స్ అధికారిగా టీఎస్‌బీపాస్‌ భవన అనుమతులు మరియు అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై నిబంధనల మేరకు పని చేస్తున్నారని, అదే సందర్భంలో కొంత కఠినంగా వ్యవహరించి ఉండొచ్చు అని, మహిళా ఉద్యోగులంటే అందరికి గౌరవ భావం ఉంటుందని, అన్ని శాఖల ఉద్యోగులు సోదరులే అని ట్రెసా తెల్పింది.

గతంలో మహిళా ఉద్యోగులపై అనేక రకాలుగా దాడులు, అవమానాలు జరిగినా ఏనాడూ స్పందించని వారు నిరంతరం ప్రజల కొరకు పనిచేస్తున్న రెవెన్యూ శాఖపై, రెవెన్యూ అధికారులపై వ్యతిరేక భావనతో మాట్లాడుతూ..విధినిర్వహణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పని చేస్తున్న ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలనడం సరికాదని ట్రెసా అభిప్రాయపడింది.