Jr NTR | జూనియర్ సైలెన్స్.. రగిలిపోతున్న TDP ఫ్యాన్స్

Jr NTR సోషల్ మీడియాలో ట్రోలింగ్. విధాత‌: మాటలతోనే కాదు.. సైలెన్స్ తో కూడా అవతలివాళ్ళను హింసించొచ్చు.. డైలాగ్స్ లేనపుడు నిశ్శబ్దం ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ కేసు ఇప్పుడు విచారణలో ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని టిడిపి కార్యకర్తలు ఏకమై ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. అది తప్పుడు కేసు అని ఆరోపిస్తూ వైసిపి మీద […]

Jr NTR | జూనియర్ సైలెన్స్.. రగిలిపోతున్న TDP ఫ్యాన్స్

Jr NTR

సోషల్ మీడియాలో ట్రోలింగ్.

విధాత‌: మాటలతోనే కాదు.. సైలెన్స్ తో కూడా అవతలివాళ్ళను హింసించొచ్చు.. డైలాగ్స్ లేనపుడు నిశ్శబ్దం ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ కేసు ఇప్పుడు విచారణలో ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని టిడిపి కార్యకర్తలు ఏకమై ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు.

అది తప్పుడు కేసు అని ఆరోపిస్తూ వైసిపి మీద దూకుడుగా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ సైతం వేగంగా స్పందించి విజయవాడ వచ్చారు.. బాబుకు మద్దతు ప్రకటించడమే కాకుండా పొత్తు ప్రకటన కూడా చేశారు. ఇదంతా ఒకెత్తు.. ఇక నందమూరి కుటుంబంలో ఎవరెవరో వచ్చి బాబుకు మద్దతు ప్రకటించి మాట్లాడుతున్నారు.

ఐతే వాళ్లంతా ఒకెత్తు కాగా సినీ పరిశ్రమతో బాటు సమాజంలో బాగా క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీయార్ మాత్రం ఎక్కడా స్పందించలేదు.. సైలెన్స్ మేంటేయిన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్ వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు.

వాస్తవానికి అయన కూడా ఈ అరెస్ట్ మీద స్పందించాలని టిడిపి అభిమానులు.. నందమూరి అభిమానులు భావించారు.. అయన రెస్పాండ్ అయితే బాగుణ్ణని ఆశించారు కానీ జూనియర్ మాత్రం ఎక్కడా కిక్కురుమనలేదు. దీంతో సగటు చంద్రబాబు అభిమానులు రగిలిపోతున్నారు.