TRS ఇక BRS.. ముహూర్తం ఖరారు

విధాత: జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరు మార్చాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. ద‌సరా రోజున మ‌ధ్యాహ్నం 1.19 నిమిషాల‌కు టీఆర్ఎస్ విస్తృత‌స్థాయి స‌మావేశంలో పార్టీ పేరు మార్చుతూ తీర్మానం చేయ‌నున్నారు. పార్టీ పేరు మార్చ‌డం వ‌ల్ల కారు గుర్తు య‌థాత‌థంగా కొన‌సాగుతుందని నాయ‌కుల‌కు కేసీఆర్ వివ‌రించారు. దేశ‌వ్యాప్తంగా తెలంగాణ న‌మూనా పాల‌న‌ను అందించేందుకు జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని వివిధ వ‌ర్గాలు కోరుతున్నాయ‌ని కేసీఆర్ వివ‌రించారు. డిసెంబ‌ర్ 9న ఢిల్లీలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని […]

  • By: krs    latest    Oct 02, 2022 5:56 PM IST
TRS ఇక BRS.. ముహూర్తం ఖరారు

విధాత: జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరు మార్చాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. ద‌సరా రోజున మ‌ధ్యాహ్నం 1.19 నిమిషాల‌కు టీఆర్ఎస్ విస్తృత‌స్థాయి స‌మావేశంలో పార్టీ పేరు మార్చుతూ తీర్మానం చేయ‌నున్నారు. పార్టీ పేరు మార్చ‌డం వ‌ల్ల కారు గుర్తు య‌థాత‌థంగా కొన‌సాగుతుందని నాయ‌కుల‌కు కేసీఆర్ వివ‌రించారు. దేశ‌వ్యాప్తంగా తెలంగాణ న‌మూనా పాల‌న‌ను అందించేందుకు జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని వివిధ వ‌ర్గాలు కోరుతున్నాయ‌ని కేసీఆర్ వివ‌రించారు. డిసెంబ‌ర్ 9న ఢిల్లీలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని సీఎం నిర్ణ‌యించారు.

జాతీయ రాజ‌కీయాల‌పై టీఆర్ఎస్ ముఖ్య‌నేత‌ల‌కు సీఎం కేసీఆర్ స్ప‌ష్ట‌త‌ ఇచ్చారు. టీఆర్ఎస్ పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంత‌రం చేస్తూ ద‌స‌రా రోజున మ‌ధ్యాహ్నం 1. 10 నిమిషాల‌కు పార్టీ విస్తృత‌స్థాయి కార్య‌వ‌ర్గం తీర్మానం చేయ‌నున్న‌ది. జాతీయ పార్టీ ఏర్పాటుపై మంత్రులు, జిల్లా అధ్య‌క్షుల‌తో కేసీఆర్ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో చ‌ర్చించారు. స్వ‌తంత్ర భార‌త దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ రెండూ విఫ‌ల‌మ‌య్యాయ‌ని కేసీఆర్ అన్నారు.

పుష్క‌ల‌మైన స‌హ‌జ‌, మాన‌వ వ‌న‌రులు ఉన్న‌ప్ప‌టికీ దేశాన్ని ఆశించినంత అభివృద్ధి చేయ‌లేక‌ పోయార‌న్నారు. కొత్త రాష్ట్ర‌మైనా తెలంగాణ‌ను అన్నిరంగాల్లో శ‌ర‌వేగంగా ముందుకు తీసుకెళ్లి దేశాన్ని ఆక‌ర్షించ‌గ‌లిగిన‌ట్లు కేసీఆర్ వివ‌రించారు. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప‌ట్ల దేశ‌మంతా ఆక‌ర్షితుల‌వుతున్నార‌ని తెలిపారు.

తెలంగాణ మోడ‌ల్‌ను దేశ‌మంత‌టికీ విస్త‌రించేందుకు జాతీయ రాజకీయాల్లోకి రావాల‌ని వివిధ వ‌ర్గాలు కోరుకుంటున్నాయ‌ని చెప్పారు. కాబ‌ట్టి పార్టీ శ్రేణులు అంగీక‌రిస్తే టీఆర్ఎస్ దేశ‌వ్యాప్తంగా విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని కేసీఆర్ చెప్ప‌డంతో మంత్రులు, జిల్లా అధ్య‌క్షులు ముక్త‌కంఠంతో ఆమోదించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై నేత‌ల‌కు సీఎం స్ప‌ష్ట‌త‌ను ఇచ్చారు. వివిధ అంశాల‌పై లోతైన అధ్య‌య‌నం చేశాక ప్ర‌స్తుత టీఆర్ఎస్ పేరును మార్చ‌నున్న‌ట్లు కేసీఆర్ వివ‌రించారు.

పార్టీ పేరుపై అభిప్రాయాలు కోర‌గా..భార‌త రాష్ట్ర స‌మితి, న‌యా భార‌త స‌మితి వంటి పేర్లను నాయ‌కులు సూచించారు. కొత్త‌గా పార్టీ ఏర్పాటు చేస్తే కారు గుర్తు కొన‌సాగ‌క‌పోవ‌చ్చు కాబ‌ట్టి ఉన్న‌పార్టీ పేరునే మార్చితే సాంకేతికంగా ఇబ్బంది ఉండ‌ద‌ని కేసీఆర్ వివ‌రించారు. కేసీఆర్ స‌హా ఎక్కువ మంది నేత‌లు భార‌త రాష్ట్ర స‌మితి పేరుకే మొగ్గు చూపారు.

పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్‌లు, రాష్ట్ర కార్య‌వ‌ర్గం స‌హా కీల‌క ప్ర‌తినిధులు స‌మావేశం కానున్నారు. టీఆర్ఎస్ పేరు మారుస్తూ తీర్మానంపై సంత‌కం చేశాక మ‌ధ్యాహ్నం 1.10నిమిషాల‌కు కేసీఆర్ ఆమోద‌ముద్ర వేయ‌నున్నారు.

ఆరోజు వివిధ రాష్ట్రాల నుంచి నేత‌లు, ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించారు. 6వ తేదీన టీఆర్ఎస్ పేరు మార్పుపై ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు అఫిడ‌విట్ స‌మ‌ర్పించ‌నున్నారు. పార్టీ పేరు మార్పును ఈసీ ఆమోదించిన త‌ర్వాత పూర్తి స్థాయి జెండా, అజెండా ప్ర‌క‌టించ‌నున్నారు.