ఉమ్మడి నల్గొండలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు
జాతీయ పతాకావిష్కరణ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా , విప్ సునీత విధాత, నల్గొండ: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి జి.జగదీశ్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేసి సందేశాన్ని వినిపించారు. తెలంగాణ స్వాతంత్య్ర సాధనకు పోరాడిన ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాట యోధులకు నివాళులర్పించారు. రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో అడుగు […]

జాతీయ పతాకావిష్కరణ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా , విప్ సునీత
విధాత, నల్గొండ: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి జి.జగదీశ్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేసి సందేశాన్ని వినిపించారు.

తెలంగాణ స్వాతంత్య్ర సాధనకు పోరాడిన ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాట యోధులకు నివాళులర్పించారు. రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో అడుగు పెట్టిన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంలో పురోగతి దిశగా వేగంగా పయనిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో దేశానికే ఆదర్శంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందన్నారు.

నల్గొండలో పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకలలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్ రెడ్డి మువ్వన్నెల పతాకావిష్కరణ చేసి ప్రసంగించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలు వేడుకల్లో పాల్గొన్నారు.

అన్ని మండలాల్లో, గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం పిలుపుతో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ప్రజలు, పార్టీలు, అధికారులు ఘనంగా జరుపుకున్నారు. హుజుర్ నగర్‌లో ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు.

నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరుతో, కాంగ్రెస్ తెలంగాణ విలీనదినం, కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణ విముక్తి, బీజేపీ తెలంగాణ విమోచన దినం, న్యూ డెమోక్రసీ తెలంగాణ విద్రోహ దినం పేరుతో తెలంగాణ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడం విశేషం.
