TSPSC | సెప్టెంబ‌ర్‌లో గ్రూప్-4 ఫ‌లితాలు..! వారం ప‌ది రోజుల్లో ప్రాథ‌మిక కీ..!

TSPSC | గ్రూప్-4 రాత‌ప‌రీక్ష ప్రాథ‌మిక కీని విడుద‌ల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది. వారం ప‌ది రోజుల్లో ప్రాథ‌మిక కీ విడుద‌ల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే గ్రూప్-4 ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్ర‌క్రియ పూర్త‌యింది. ఇక ప్రాథ‌మిక కీ విడుద‌ల చేసి, అభ్యంత‌రాల‌ను స్వీక‌రించ‌డ‌మే ఆల‌స్యం. కీ విడుద‌ల చేసిన త‌ర్వాత అభ్యంత‌రాల‌కు వారం రోజుల పాటు గ‌డువు ఇవ్వ‌నున్నారు. అభ్యంత‌రాల‌ను స్వీక‌రించిన త‌ర్వాత నిపుణుల క‌మిటీతో చ‌ర్చించి, తుది కీ విడుద‌ల […]

  • By: raj    latest    Aug 09, 2023 6:02 AM IST
TSPSC | సెప్టెంబ‌ర్‌లో గ్రూప్-4 ఫ‌లితాలు..! వారం ప‌ది రోజుల్లో ప్రాథ‌మిక కీ..!

TSPSC |

గ్రూప్-4 రాత‌ప‌రీక్ష ప్రాథ‌మిక కీని విడుద‌ల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది. వారం ప‌ది రోజుల్లో ప్రాథ‌మిక కీ విడుద‌ల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే గ్రూప్-4 ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్ర‌క్రియ పూర్త‌యింది.

ఇక ప్రాథ‌మిక కీ విడుద‌ల చేసి, అభ్యంత‌రాల‌ను స్వీక‌రించ‌డ‌మే ఆల‌స్యం. కీ విడుద‌ల చేసిన త‌ర్వాత అభ్యంత‌రాల‌కు వారం రోజుల పాటు గ‌డువు ఇవ్వ‌నున్నారు. అభ్యంత‌రాల‌ను స్వీక‌రించిన త‌ర్వాత నిపుణుల క‌మిటీతో చ‌ర్చించి, తుది కీ విడుద‌ల చేయ‌నుంది టీఎస్‌పీఎస్సీ.

ఫైన‌ల్ కీ విడుద‌లైన నాలుగైదు రోజుల‌కే గ్రూప్-4 ఫ‌లితాలు ప్ర‌క‌టించాల‌ని టీఎస్‌పీఎస్సీ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. అంటే ఈ ప్ర‌క్రియ పూర్త‌వ‌డానికి మ‌రో నెల రోజుల స‌మ‌యం ప‌ట్ట‌నుంది.

మొత్తంగా సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు గ్రూప్-4 ఫ‌లితాలు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. 8 వేల‌కు పైగా గ్రూప్-4 ఖాళీలు ఉన్నాయి. గ్రూప్-4 ప‌రీక్ష‌కు 7.6 ల‌క్ష‌ల మంది హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.