తిరుమల: అనూహ్యంగా పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 48 గంటల సమయం

విధాత‌, తిరుమ‌ల‌: తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండి గోగ‌ర్బం వరకు భక్తులు వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి 6 కిలోమీటర్లకు పైగా భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. సరైన సౌకర్యాలు లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. దర్శనం కోసం ఇప్పటికే క్యూలైన్లలో లక్షన్నర మంది భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్లలోకి భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం నిలిపివేసిన అధికారులు రేపు ఉద‌యం భ‌క్తుల‌ను క్యూలైన్లలోకి […]

తిరుమల: అనూహ్యంగా పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 48 గంటల సమయం

విధాత‌, తిరుమ‌ల‌: తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండి గోగ‌ర్బం వరకు భక్తులు వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి 6 కిలోమీటర్లకు పైగా భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. సరైన సౌకర్యాలు లేక భక్తులు అవస్థలు పడుతున్నారు.

దర్శనం కోసం ఇప్పటికే క్యూలైన్లలో లక్షన్నర మంది భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్లలోకి భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం నిలిపివేసిన అధికారులు రేపు ఉద‌యం భ‌క్తుల‌ను క్యూలైన్లలోకి పంపుతామ‌ని టీటీడీ అధికారులు తెలిపారు.