TTD | తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి

TTD విధాత, తిరుమల కాలిబాట మెట్ల మార్గంలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. మెట్ల మార్గంలో వెళ్తున్న వ్యక్తికి ఎలుగుబంటి కనిపించింది. ఎలుగుబంటి మెట్ల మార్గం దాటుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. రాత్రి 11గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద ఎలుగు బంటి కనిపించింది. ఇటీవల మెట్ల మార్గంలో చిరుతల సంచారం, బాలుడిపై దాడి ఘటనల పిదప ఇప్పుడు ఎలుగు సంచారం భక్తులను కలవర పెడుతుంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ, అటవీ శాఖ యంత్రాంగం మెట్ల మార్గంలో భద్రతను సమీక్షించారు.

  • By: krs    latest    Aug 01, 2023 1:01 AM IST
TTD | తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి

TTD

విధాత, తిరుమల కాలిబాట మెట్ల మార్గంలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. మెట్ల మార్గంలో వెళ్తున్న వ్యక్తికి ఎలుగుబంటి కనిపించింది. ఎలుగుబంటి మెట్ల మార్గం దాటుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. రాత్రి 11గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద ఎలుగు బంటి కనిపించింది.

ఇటీవల మెట్ల మార్గంలో చిరుతల సంచారం, బాలుడిపై దాడి ఘటనల పిదప ఇప్పుడు ఎలుగు సంచారం భక్తులను కలవర పెడుతుంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ, అటవీ శాఖ యంత్రాంగం మెట్ల మార్గంలో భద్రతను సమీక్షించారు.