MLA Rajaiah | ఎమ్మెల్యే రాజయ్య, నవ్య వివాదంలో ట్విస్ట్.. జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్ల జోక్యం

MLA Rajaiah | నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు నవ్యకు ఏసీపీ నోటీసు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, అదే పార్టీకి చెందిన ధర్మసాగర్‌ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. వీరి అంశంలో కొత్త ట్విస్టులు జరుగుతున్నాయి. గతంలో తనను ఎమ్మెల్యే రాజయ్య లైంగికవేధింపులకు గురిచేశారని నవ్య ఆరోపించారు. ఆ తర్వాత ఇద్దరూ రాజీకి వచ్చారు. కొద్ది కాలం […]

  • By: krs    latest    Jun 24, 2023 12:57 PM IST
MLA Rajaiah | ఎమ్మెల్యే రాజయ్య, నవ్య వివాదంలో ట్విస్ట్.. జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్ల జోక్యం

MLA Rajaiah |

  • నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు
  • నవ్యకు ఏసీపీ నోటీసు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, అదే పార్టీకి చెందిన ధర్మసాగర్‌ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. వీరి అంశంలో కొత్త ట్విస్టులు జరుగుతున్నాయి.

గతంలో తనను ఎమ్మెల్యే రాజయ్య లైంగికవేధింపులకు గురిచేశారని నవ్య ఆరోపించారు. ఆ తర్వాత ఇద్దరూ రాజీకి వచ్చారు. కొద్ది కాలం సద్దుమణిగిన సంఘటన తాజాగా మరోసారి నవ్య తెర పైకి తెచ్చింది. రాజీ సందర్భంగా గ్రామాభివృద్ధికి కేటాయిస్తానని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆమె ఆరోపించారు.

ఈ రూ.20 లక్షల నిధులు కేటాయించాలంటే గతంలో ఎమ్మెల్యే చేసిన లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో టేపులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు నవ్య ఆరోపించారు. ఈ విషయంలో తన భర్తను కూడా ట్రాప్ చేసినట్లు చెప్పారు. దీనిపై స్థానిక ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పీఎ, ఎంపీపీతో పాటు తన భర్త పై ఫిర్యాదు చేశారు.

జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్ల జోక్యం

దీనిపై పోలీసులు విచారణ చేస్తుండగానే తాజాగా నవ్య కేసును జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఈ మేరకు పూర్తి విచారణ చేపట్టి నివేదిక అందించాలని పోలీసు శాఖను ఆదేశించాయి.

ఇదిలా ఉంటే కాజీపేట ఏసీపీ శుక్రవారం ఎమ్మెల్యే రాజయ్య వేధింపులకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలంటూ నవ్యకు నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు దగ్గర పడ్డ ప్రస్తుత పరిస్థితుల్లో నవ్య ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంకంగా మారాయి.