Twitter | కంటెంట్ క్రియేటర్లకు శుభవార్త చెప్పిన ట్విట్టర్..! యూట్యూబ్ తరహాలోనే ఇక రెవెన్యూ షేరింగ్..!
Twitter | కంటెంట్ క్రియేటర్లకు మైక్రోబ్లాగింగ్ కంపెనీ ట్విట్టర్ గుడ్‌న్యూస్ చెప్పింది. యూట్యూబ్ తరహాలోనే ట్విట్టర్‌లో సైతం కంటెంట్ క్రియేటర్లకు చెల్లింపులను ప్రారంభించింది. ఇందు కోసం యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ట్విట్టర్‌లో కంటెంట్‌ను పోస్ట్ చేసే సంపాదించే వారి కోసం ప్రస్తతం ట్విటర్ క్రియేటర్స్ ఇనిషియల్ గ్రూప్‌ను తీసుకువచ్చింది. త్వరలోనే ప్రోగ్రామ్‌ను మరింత విస్తరించే అవకాశం ఉంది. అర్హులైన కంటెంట్ క్రియేటర్లకు యాప్‌లో, ఈ మెయిల్ ద్వారా […]

Twitter | కంటెంట్ క్రియేటర్లకు మైక్రోబ్లాగింగ్ కంపెనీ ట్విట్టర్ గుడ్‌న్యూస్ చెప్పింది. యూట్యూబ్ తరహాలోనే ట్విట్టర్‌లో సైతం కంటెంట్ క్రియేటర్లకు చెల్లింపులను ప్రారంభించింది. ఇందు కోసం యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ట్విట్టర్‌లో కంటెంట్‌ను పోస్ట్ చేసే సంపాదించే వారి కోసం ప్రస్తతం ట్విటర్ క్రియేటర్స్ ఇనిషియల్ గ్రూప్‌ను తీసుకువచ్చింది. త్వరలోనే ప్రోగ్రామ్‌ను మరింత విస్తరించే అవకాశం ఉంది.
అర్హులైన కంటెంట్ క్రియేటర్లకు యాప్‌లో, ఈ మెయిల్ ద్వారా ఎంత చెల్లింపు చేయనున్నదో సమాచారం అందించినట్లు తెలిసింది. ఇప్పటికే కొంతమంది క్రియేటర్లు ఈ విషయాన్ని షేర్ చేశారు. ఖతాల్లో నగదు ఎప్పటిలోగా జమకానున్నదో సైతం తెలిపారు.
అయితే, ట్విట్టర్‌లో బ్లూ సబ్‌స్క్రిప్షన్ పొంది ఉంటేనే మానిటైజేషన్‌కు అర్హత పొందుతారు. అలాగే గత మూడు నెలల్లో పోస్టులపై ప్రతి నెలా కనీసం ఐదు మిలియన్ల ఇంప్రెషన్స్ వచ్చి ఉండాలి. అంతేకాకుండా క్రియేటర్ మానిటైజేషన్ స్టాండర్డ్స్ హ్యూమన్ రివ్యూలోనూ పాసై ఉంటేనే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
అయితే, ట్విట్టర్ చెల్లింపులు చేయడానికి ప్రత్యేకంగా కారణం ఏంటంటే.. ఇటీవల మెటా కంపెనీ కొత్తగా థ్రెడ్స్ యాప్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రారంభించిన కొద్ది గంటల్లోనే కోట్లాది మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అన్నివిధాలా ట్విట్టర్‌ను పోలి ఉన్న థ్రెడ్స్‌ను.. ట్విట్టర్ కిల్లర్‌గా పేర్కొంటున్నారు.
భవిష్యత్‌లో కొత్త యాప్ నుంచి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉండడంతో యాడ్స్ రాబట్టడం కంపెనీకి కాస్త సవాల్‌గా మారుతున్నది. ఈ క్రమంలోనే కంటెంట్ క్రియేటర్లకు చెల్లింపులు చేసేందుకు ట్విట్టర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.