Twitter Logo | ట్విట్టర్‌ లోగో మారింది..! బ్లూ బర్డ్‌ ప్లేస్‌లో డాగీ..

Twitter Logo | ట్విటర్‌ (Twitter)లో సోమవారం కీలక మార్పు చోటు చేసుకున్నది. నిత్యం యూజర్లకు కనిపించే బ్లూ బర్డ్‌ ఇక కనిపించదు. దాని స్థానంలో డాగీ (Doge)ని ట్విట్టర్‌ తీసుకువచ్చింది. మొన్నటి వరకు కనిపించిన బ్లూ బర్డ్‌ ఒక్కసారిగా మాయం కావడంతో యూజర్లంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్విట్టర్‌ లోగో #DOGE ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే, చాలా మంది యూజర్లు తమ అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయని భావించారు. కొద్దిసేపటి తర్వాత ట్విట్టర్ సీఈవో ఎలాన్‌ […]

Twitter Logo | ట్విట్టర్‌ లోగో మారింది..! బ్లూ బర్డ్‌ ప్లేస్‌లో డాగీ..

Twitter Logo | ట్విటర్‌ (Twitter)లో సోమవారం కీలక మార్పు చోటు చేసుకున్నది. నిత్యం యూజర్లకు కనిపించే బ్లూ బర్డ్‌ ఇక కనిపించదు. దాని స్థానంలో డాగీ (Doge)ని ట్విట్టర్‌ తీసుకువచ్చింది. మొన్నటి వరకు కనిపించిన బ్లూ బర్డ్‌ ఒక్కసారిగా మాయం కావడంతో యూజర్లంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్విట్టర్‌ లోగో #DOGE ట్రెండింగ్‌లోకి వచ్చింది.

అయితే, చాలా మంది యూజర్లు తమ అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయని భావించారు. కొద్దిసేపటి తర్వాత ట్విట్టర్ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ లోగోను మార్చినట్లు ప్రకటించారు. దాంతో యూజర్లు షాక్‌కు గురయ్యారు. అయితే, ఎలాన్‌ మస్క్‌ ఇంతకుముందే ట్విట్టర్‌ లోగోను మార్చనున్నట్లు హింట్‌ ఇచ్చాడు. లోగోను మారిన తర్వాత మార్చి 26న చేసిన ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను సైతం ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆ పోస్ట్‌లో మస్క్ కొత్త ప్లాట్ పారమ్ అవసరమా అని యూజర్లను ప్రశ్నించాడు.

దీనికి స్పంబంధించిన ఓ చైర్మన్‌ అనే యూజర్‌ ట్విటర్‌ని కొనుగోలు చేయండి.. దాని బ్లూ బర్డ్ లోగోను డాగీతో రీప్లేస్‌ చేయండి.. అంటూ పోస్ట్‌ పెట్టారు. ఇదిలా ఉండగా.. ట్విట్టర్‌ కొత్త లోగో కేవలం డెస్క్‌టాప్‌లో మాత్రమే కనిపించనున్నది. మొబైల్‌ యాప్‌లో ఎలాంటి మార్పులు ఉండవని, గతంలోలాగే బ్లూ బర్డ్ లోగో కనిపించనున్నది. మరో వైపు కొత్త లోగోపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. కొత్త లోగో అద్భుతంగా ఉందని పలువురు యూజర్లు పేర్కొంటున్నారు.