నల్గొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

విధాత: హైద్రాబాద్ - విజయవాడ హైవేపై ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నల్గొండ జిల్లా కేతేపల్లి (మం)ఇనుపాముల వద్ద అదుపుతప్పిన ఓ కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా కారు డివైడర్ ను బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దగ్దమైంది. […]

  • By: krs    latest    Dec 16, 2022 2:43 AM IST
నల్గొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

విధాత: హైద్రాబాద్ – విజయవాడ హైవేపై ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నల్గొండ జిల్లా కేతేపల్లి (మం)ఇనుపాముల వద్ద అదుపుతప్పిన ఓ కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా కారు డివైడర్ ను బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దగ్దమైంది. హైద్రాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.