మంత్రిగా ప్రమాణం చేయనున్న సీఎం స్టాలిన్ కుమారుడు
Udhayanidhi Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌కు ఆ రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు లభించింది. ఈ నెల 14వ తేదీన ఉదయం 9:30 గంటలకు ఉదయనిధి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలకు మీడియాకు సమాచారాన్ని అందించాయి. గవర్నర్ సీటీ రవి ఉదయనిధి చేత ప్రమాణం చేయించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలోకి ఉధయనిధిని తీసుకోవాలంటూ ఇటీవల డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన […]

Udhayanidhi Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌కు ఆ రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు లభించింది. ఈ నెల 14వ తేదీన ఉదయం 9:30 గంటలకు ఉదయనిధి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలకు మీడియాకు సమాచారాన్ని అందించాయి. గవర్నర్ సీటీ రవి ఉదయనిధి చేత ప్రమాణం చేయించనున్నారు.
రాష్ట్ర మంత్రివర్గంలోకి ఉధయనిధిని తీసుకోవాలంటూ ఇటీవల డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన సిఫారసుకు గవర్నర్ సీటీ రవి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తమిళ నటుడు, నిర్మాత అయిన ఉధయనిధి మొదటిసారిగా 2021 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. చెపాక్-తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఉధయనిధికి మంత్రి పదవి కట్టబెట్టాలని ఇటీవల డిమాండ్‌లు పెరగడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే పార్టీ ప్రకటించింది.