Wilko | దివాళ అంచున ప్రఖ్యాత రిటైల్ సంస్థ.. ప్రమాదంలో 12 వేల ఉద్యోగాలు
Wilko విధాత: యూకే లో వస్తువులను చవగ్గా విక్రియిస్తూ మధ్యతరగతికి చేరువైన విల్కో (Wilko) రిటైల్ సంస్థ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. రోజు వారీ కార్యక్రమాలకు కూడా నిధుల లభ్యత లేకపోవడంతో దివాళా అంచుకు చేరింది. దీంతో అందులో పనిచేస్తున్న 12 వేల మంది ఉద్యోగాలు ప్రమాదం (Jobs in Danger) లో పడ్డాయి. యూకే (UK) లో సుమారు 400 స్టోర్లతో వ్యాపారం చేస్తున్న విల్కోతో అక్కడి వారి జ్ఞాపకాలు ముడి పడి ఉన్నాయి. విల్కో […]

Wilko
విధాత: యూకే లో వస్తువులను చవగ్గా విక్రియిస్తూ మధ్యతరగతికి చేరువైన విల్కో (Wilko) రిటైల్ సంస్థ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. రోజు వారీ కార్యక్రమాలకు కూడా నిధుల లభ్యత లేకపోవడంతో దివాళా అంచుకు చేరింది. దీంతో అందులో పనిచేస్తున్న 12 వేల మంది ఉద్యోగాలు ప్రమాదం (Jobs in Danger) లో పడ్డాయి.
యూకే (UK) లో సుమారు 400 స్టోర్లతో వ్యాపారం చేస్తున్న విల్కోతో అక్కడి వారి జ్ఞాపకాలు ముడి పడి ఉన్నాయి. విల్కో స్టోర్లు మూత పడితే తనకు ప్రాణం పోయినట్టు ఉంటుందని అలెక్స్ అనే వినియోగ దారుడు వ్యాఖ్యానించాడు. డిటర్జెంట్లు, స్నాక్స్, అన్నీ అక్కడే తక్కువ ధరలకు కొనుక్కునే వాడినని చెప్పుకొచ్చాడు.
1930లో జేకే విల్కిన్‌సన్ అనే వ్యాపారవేత్త విల్కీ పేరుతో మొదటి స్టోర్‌ను లీంచెస్టర్‌లో ప్రారంభించాడు. 1939 నుంచి విల్కిన్‌సన్ క్యాష్ స్టోర్ల పేరుతో సంస్థ శాఖోపశాఖలుగా విస్తరించింది. అనంతరం 2012లో విల్కో అని పేరు మార్చి బ్రాండింగ్ చేశారు. అయితే కాలానికి తగినట్లు రూపాంతరం చెందక పోవడంతో ఈ సంస్థ నష్టాల బాట పట్టింది.
తమ చిన్నప్పుడు అక్కడ ఏం అమ్మారో ఇప్పుడూ అవే విక్రయిస్తున్నారని రిచర్చ్ లిమ్ అనే వ్యక్తి చెప్పాడు. ఒక తరం వారికి ఆ స్టోర్లతో భావోద్వేగ పరమైన అనుబంధం ఉన్నప్పటికీ.. ఆ బంధం ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చలేదని వ్యాఖ్యానించాడు. పౌండ్‌లాండ్, బీ అండ్ బీ వంటి సంస్థలు గట్టి పోటీ ఇవ్వడం కూడా విల్కీ ఇబ్బందులను పెంచింది.
అంతే కాకుండా ఈ సంస్థకున్న 400 స్టోర్లలో చాలా మటుకు నగరాల్లో రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఉంటున్నా యి. దీని వల్ల కార్లలో వచ్చే ధనిక వ్యాపారులు ఇక్కడకి రాలేకపోతున్నారు. బదులుగా వారు నగర శివార్లలో ఉండే విశాలమైన రిటైర్ల పార్కులకు వెళ్లి పోతున్నారని ఒక మార్కెట్ నిపుణుడు అభిప్రాయ పడ్డారు.
దిద్దుబాటు చర్యలు
విల్కో ఇప్పటికే రీస్ట్రక్చరింగ్ సంస్థ హిల్కో నుంచి 40 మిలియన్ పౌండ్లను రుణంగా తీసుకుంది. ఆ నిబంధనల ప్రకారం ఉద్యోగాల్లో కోత, యాజమాన్యంలో మార్పులను చేయాల్సి ఉంటుంది. అలాగే మరీ భారంగా పరిణమించిన శాఖలను విక్రయించడం ద్వారా కొన్ని నిధులను సేకరించనున్నారు. ప్రస్తుతం విల్కీ స్టోర్లలో చాలా చోట్ల ఖాళీ అరలు కనిపిస్తున్నాయి.
డీలర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు సరఫరాను నిలిపివేయడమే దీనికి కారణం. కొవిడ్ ఇబ్బందులు, ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు ఆచితూచి ఖర్చుపెడుతుండటంతో ఈ సంస్థ మళ్లీ బతుకుతుందా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి.