ఉక్రెయిన్ vs రష్యా: అధికారికంగా 13వేల మంది రష్యా ఉన్నతాధికారులు మృతి
విధాత: ఉక్రెయిన్‌పై దాడి రష్యాకు ఇంటా బయటా ఎనలేని అపకీర్తిని తెచ్చిపెట్టేలా ఉన్నది. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా.. ఉక్రెయిన్‌పై దాడికి తెగబడిన రష్యా అంతకంతకూ కష్ట నష్టాల్లో కూరుకు పోతున్నది. ఒకటి రెండు రోజుల్లోనే ఉక్రెయిన్‌ను పాదాక్రాంతం చేసుకొంటానని ప్రగల్బాలు పలికి యుద్ధానికి దిగిన రష్యా ఇప్పుడు ఎన్నడు ముగుస్తుందో తెలియని యుద్ధంలో చిక్కుకు పోయింది. ఆరంభ రోజుల్లో ఉక్రెయిన్‌కు చెందిన వందల కిలోమీటర్ల భూ భాగాన్నీ, కొన్ని ప్రధాన నగరాలను రష్యా స్వాధీనం చేసుకున్నది. క్రమంగా […]

విధాత: ఉక్రెయిన్‌పై దాడి రష్యాకు ఇంటా బయటా ఎనలేని అపకీర్తిని తెచ్చిపెట్టేలా ఉన్నది. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా.. ఉక్రెయిన్‌పై దాడికి తెగబడిన రష్యా అంతకంతకూ కష్ట నష్టాల్లో కూరుకు పోతున్నది. ఒకటి రెండు రోజుల్లోనే ఉక్రెయిన్‌ను పాదాక్రాంతం చేసుకొంటానని ప్రగల్బాలు పలికి యుద్ధానికి దిగిన రష్యా ఇప్పుడు ఎన్నడు ముగుస్తుందో తెలియని యుద్ధంలో చిక్కుకు పోయింది.
ఆరంభ రోజుల్లో ఉక్రెయిన్‌కు చెందిన వందల కిలోమీటర్ల భూ భాగాన్నీ, కొన్ని ప్రధాన నగరాలను రష్యా స్వాధీనం చేసుకున్నది. క్రమంగా ఉక్రెయిన్ సేనల ప్రతిఘటన పెరిగి రష్యా వెనుకడుగు వేయాల్సి వస్తున్నది. తన విజయాలుగా చెప్పుకొన్న ఆక్రమిత నగరాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకొంటున్నది.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి పది నెలలు దాటుతున్నది. ఉక్రెయిన్ సేనల ప్రతిఘటనతో రష్యా సేనలు అడుగడుగునా పరాభవాలను, ఓటమిని చవిచూస్తున్నవి. ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారమే 13వేల మంది రష్యా సైనిక ఉన్నతాధికారులు చనిపోయారని తెలుస్తున్నది. అనధికారికంగా వేల సంఖ్యలో సైనికులు మరణించి ఉండవచ్చనే అంచనాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని స్థితిలో రష్యా అధినేత పుతిన్ పోరాడుతున్న తమ సైనికులను హీరోలుగా కీర్తించాలని తమ దేశ పౌరులకు పిలుపునిచ్చాడు. అలాగే.. ఉక్రెయిన్ యుద్ధ భూమిలోకి తమ సేనలను పెద్ద ఎత్తున పంపేందుకు చేస్తున్న ప్రయత్నాలను రష్యా సైనికులు నిరాకరిస్తున్నారు.
యుద్ధభూమిలోకి అడుగు పెట్టడానికి ఒప్పుకోవటం లేదు. ఇలా యుద్ధానికి పోవటానికి నిరాకరించిన సైనికులను నేల మాలిగల్లో బంధించి హింసిస్తున్నారని సైనికులు వాపోతున్నారు. అనవసర ప్రతిష్టకు పోయి తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారని రష్యా సైనికులు ఆరోపిస్తున్నారు.