ఆ రెండు పార్టీల మధ్య అవగాహన మేరకే ఇదంతా?
ఉన్నమాట: ఎన్నికల రాజకీయాల కోసం ఓట్లు, సీట్ల కోసం రాజకీయ పార్టీలు ఏమైనా మాట్లాడుతుంటాయి. కానీ ప్రజలకు మాత్రం ఎప్పుడూ స్పష్టత ఉంటుంది. ఎన్నికల సమయంలో ఏ పార్టీ ఏం చెప్పినా ఎవరిని గద్దెనెక్కించాలో ఎవరిని దించాలో వారికి పూర్తి అవగాహనతో ఉంటారు. ఇవాళ ఇద్దరు వాకర్స్ ఒక దగ్గర కూర్చుని రాష్ట్ర రాజకీయాలపై సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. నిజానికి వారి మాటలు ఆలోచింప జేసేవిగా ఉన్నాయి. సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైంది. […]

ఉన్నమాట: ఎన్నికల రాజకీయాల కోసం ఓట్లు, సీట్ల కోసం రాజకీయ పార్టీలు ఏమైనా మాట్లాడుతుంటాయి. కానీ ప్రజలకు మాత్రం ఎప్పుడూ స్పష్టత ఉంటుంది. ఎన్నికల సమయంలో ఏ పార్టీ ఏం చెప్పినా ఎవరిని గద్దెనెక్కించాలో ఎవరిని దించాలో వారికి పూర్తి అవగాహనతో ఉంటారు. ఇవాళ ఇద్దరు వాకర్స్ ఒక దగ్గర కూర్చుని రాష్ట్ర రాజకీయాలపై సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. నిజానికి వారి మాటలు ఆలోచింప జేసేవిగా ఉన్నాయి.
సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం. ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. అయితే నాటి ఆపరేషన్ పోలోపై రాజకీయ పార్టీలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. విలీనమని ఒక పార్టీ అంటే కాదు విమోచనం అని మరొక పార్టీ, అట్లా అది విద్రోహం అని ఇంకొక పార్టీ వాదన ఎప్పపటి నుంచో ఉన్నది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవ వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం అధికారికంగా నిర్వహించడంతో పూర్తిగా రాజకీయ వాతావరణం నెలకొన్నది. నాటి పోరాటంలో త్యాగాలు చేసిన వారి కంటే ప్రస్తుతం రోడ్లపై నాయకుల ఫ్లెక్సీలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. అంతేకాదు స్వాతంత్య్ర పోరాటంతో, సాయుధ పోరాటంతో సంబంధం లేని ఒక పార్టీ విమోచన పేరుతో వేడుకలు చేయడం హాస్యాస్పదమన్నారు. అట్లనే కేంద్ర నిర్ణయాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించిందని వాళ్లు అభిప్రాయపడ్డారు.
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నది. అయితే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని ఎవరిని అడిగినా చెబుతారు. బీజేపీ బరిలో ఉన్నా పోటీ నామమాత్రమే. ఎక్కువ స్థానాల్లో ద్విముఖ పోరే ఉంటుంది. కానీ ఈ పోరును త్రిముఖ పోరుగా మార్చేందుకు టీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి.
అందుకే కొంతకాలంగా కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు విస్తృతంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. త్రిముఖ పోరు ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం కావొచ్చు. అందుకే ఆ పార్టీల మధ్య అవగాహన మేరకే ఇదంతా జరుగుతున్నదని వారు చర్చించుకున్నారు. దీనివల్ల ఎవరికి లాభమని ప్రశ్న కూడా వచ్చింది.
దానికి ఇద్దరిలో ఒకతను స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చడమే వారి లక్ష్యమన్నారు. అయితే ప్రజలు అంత అమాయకులు కాదు. ఒక పార్టీని ఓడగొట్టాలని వారు గనుక గట్టిగా నిర్ణయించుకుంటే అంతర్గతంగా కొన్ని పార్టీలు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ వారు ఓటమిని తప్పించుకోలేరు, ఇంకో పార్టీ గెలుపు అడ్డుకోలేరు అన్నారు.