విధాత: పంజాబ్‌లోని చండీఘర్ యూనివర్సిటీకి చెందిన అమ్మాయిల ప్రయివేటు వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమైనట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, అవన్నీ పుకార్లేనని యూనివర్సిటీ యాజమాన్యం స్పష్టం చేసింది. కేవలం ఒక అమ్మాయి మాత్రమే తనకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను బాయ్ ఫ్రెండ్‌తో షేర్ చేసుకుందని తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు అమ్మాయిలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు వస్తున్న వార్తలో కూడా నిజం లేదన్నారు. ఏ ఒక్క అమ్మాయి కూడా ఆస్పత్రిలో చేరలేదని యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. […]
విధాత: పంజాబ్‌లోని చండీఘర్ యూనివర్సిటీకి చెందిన అమ్మాయిల ప్రయివేటు వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమైనట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, అవన్నీ పుకార్లేనని యూనివర్సిటీ యాజమాన్యం స్పష్టం చేసింది. కేవలం ఒక అమ్మాయి మాత్రమే తనకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను బాయ్ ఫ్రెండ్‌తో షేర్ చేసుకుందని తెలిపారు.
ఇక ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు అమ్మాయిలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు వస్తున్న వార్తలో కూడా నిజం లేదన్నారు. ఏ ఒక్క అమ్మాయి కూడా ఆస్పత్రిలో చేరలేదని యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.
చండీఘర్ యూనివర్సిటీ అమ్మాయిల ప్రైవేటు వీడియోల ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అధికారులతో మాట్లాడానని, పుకార్లకు దూరంగా ఉండాలని యూనివర్సిటీ విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నానని పంజాబ్ సీఎం పేర్కొన్నారు.