ఏడాది పొడవునా అమెరికా H2B వీసాలు
సాధారణ పనులు, సేవల కోసం అమెరికా H2B వీసాలు విధాత: మొట్టమొదటి సారి అమెరికా ఏడాది పొడవునా తాత్కాలిక వీసాలు ఇవ్వటానికి నిర్ణయించింది. సీజన్ వారీ పనులు, ఇతర సేవలు అందించటానికి నైపుణ్యం లేని సాధారణ కార్మికులకు తాత్కాలిక వీసాలు ఇవ్వాలని అమెరికా భావిస్తున్నది. వీటిని హెచ్ 2 బి వీసాలంటారు. నైపుణ్యం అవసరం లేని పనుల కోసం కార్మికులకు ఏడాది పొడవునా వీసాలు ఇవ్వటం ఇదే తొలిసారి. వ్యవసాయేతర పనులు, నిర్మాణ పనులు, ఇతర సేవా […]

- సాధారణ పనులు, సేవల కోసం అమెరికా H2B వీసాలు
విధాత: మొట్టమొదటి సారి అమెరికా ఏడాది పొడవునా తాత్కాలిక వీసాలు ఇవ్వటానికి నిర్ణయించింది. సీజన్ వారీ పనులు, ఇతర సేవలు అందించటానికి నైపుణ్యం లేని సాధారణ కార్మికులకు తాత్కాలిక వీసాలు ఇవ్వాలని అమెరికా భావిస్తున్నది. వీటిని హెచ్ 2 బి వీసాలంటారు.
నైపుణ్యం అవసరం లేని పనుల కోసం కార్మికులకు ఏడాది పొడవునా వీసాలు ఇవ్వటం ఇదే తొలిసారి. వ్యవసాయేతర పనులు, నిర్మాణ పనులు, ఇతర సేవా పనులు చేయటానికి వీరికి అనుమతిస్తారు. దీని కోసం 64,716 వీసాలు ఇవ్వనున్నట్లు అమెరికా ప్రకటించటింది. అయితే ఇలాంటి పనుల కోసం భారత్ నుంచి పోతున్న వారు ఇప్పటిదాకా తక్కువనే చెప్పాలి.
సాధారణంగా వృత్తినిపుణులైన వారికే అమెరికా ఎక్కువగా వీసాలు ఇస్తున్నది. వీటిని హెచ్ 1బీ వీసాలంటారు. భారతీయులు ఎక్కువగా ఈ వీసాలపైనే అమెరికా వెళ్తుంటారు. మరో మాటలో చెప్పాలంటే.. అమెరికా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ రంగంలో భారతీయుల సంఖ్యనే అత్యధికమనే పేరున్నది. దాని ప్రతిఫలమే ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీల సీఈఓలుగా భారతీయులున్నారు. సుందర్ పిచయ్, సత్య నాదేళ్ల లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.