Canada | కెనడా ప్రధాని ట్రూడోకు హ్యాండిచ్చిన అమెరికా.. భారత్‌ను ఖండించానికి నిరాకరణ
Canada విధాత: కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ కాల్చివేత ఘటనలో భారత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన జస్టిన్ ట్రూడో (Justin Trudeau) కు అంతర్జాతీయంగా తగినంత స్పందన లభించడం లేదు. కెనడాకు మిత్ర, సరిహద్దు దేశమైన అమెరికా (America) సైతం ఈ వివాదానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ ఒక వార్తా కథనంలో పేర్కొంది. భారత్ చర్యను ఖండించాలని కెనడా ప్రధాని స్వయంగా కోరినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దుందుడుకు చైనాను […]

Canada
విధాత: కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ కాల్చివేత ఘటనలో భారత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన జస్టిన్ ట్రూడో (Justin Trudeau) కు అంతర్జాతీయంగా తగినంత స్పందన లభించడం లేదు. కెనడాకు మిత్ర, సరిహద్దు దేశమైన అమెరికా (America) సైతం ఈ వివాదానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ ఒక వార్తా కథనంలో పేర్కొంది.
భారత్ చర్యను ఖండించాలని కెనడా ప్రధాని స్వయంగా కోరినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దుందుడుకు చైనాను నియంత్రించడానికి తమకు అక్కరకు వస్తున్న భారత్‌తో ఇప్పుడు వివాదాలు అనవసరమని శ్వేతసౌధం భావిస్తోందని ఒక సీనియర్ అమెరికన్ దౌత్యవేత్త చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
అలాగే కనీసం అయిదు దేశాలు తమకు బాసటగా నిలుస్తాయని ట్రూడో పెట్టుకున్న ఆశ కూడా నెరవేరేలా లేదు. ద ఫైవ్ ఐస్ అనే ఇంటెలిజెన్స్ కూటమిలో కెనడాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, అమెరికా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాధినేతలు కూడా బహిరంగంగా భారత్‌ను ఖండించడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. జీ-20 సదస్సు జరగానికి కొన్ని వారాలకు ముందే ఫైవ్ ఐస్ సభ్య దేశాల అధికారులు నిజ్జర్ హత్యపై చర్చించుకున్నా ఆ వివరాలు బయటకు రాలేదు.
జీ-20 సదస్సు సందర్భంగా ఆ దేశాధినేతలందరూ భారత ప్రధాని మోదీ వద్ద నిజ్జర్ హత్యను గట్టిగా ప్రస్తావించాలని కెనడా చేసిన ప్రతిపాదన ఆ సమావేశంలో వీగిపోయింది. భారత్ ఇంత ప్రతిష్ఠాత్మకమైన సదస్సును నిర్వహిస్తున్నందున ఆ వాతావరణాన్ని పాడు చేసేలా వ్యవహరించలేమని ఫైవ్ ఐస్ సభ్య దేశాలు స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు తన పార్లమెంటు ప్రకటన అనంతరం భారత్ ప్రతి చర్యలకు దిగడం, తనకు మద్దతు రాకపోవడంతో ట్రూడో దిద్దుబాటు చర్యలకు దిగారు. భారత్‌ను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని.. దర్యాప్తునకు వారు సరిగా స్పందించాలని ఒక ప్రకటన విడుదల చేశారు.