బర్రెలను ఢీకొట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. దెబ్బతిన్న ఇంజిన్
విధాత: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. సెమీ హై స్పీడ్‌తో వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్.. ఈ ఉదయం బర్రెలను ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్ దెబ్బతిన్నది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముంబై నుంచి గాంధీనగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు నిర్ధారించారు. బట్వా - మణినగర్ మధ్య ఉదయం 11 గంటలకు బర్రెలను వందే భారత్ ఎక్స్‌ప్రెస్ […]

విధాత: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. సెమీ హై స్పీడ్‌తో వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్.. ఈ ఉదయం బర్రెలను ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్ దెబ్బతిన్నది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముంబై నుంచి గాంధీనగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు నిర్ధారించారు. బట్వా – మణినగర్ మధ్య ఉదయం 11 గంటలకు బర్రెలను వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సెమీ హైస్పీడ్ రైలు.. విమానం లాంటి ప్రయాణ అనుభూతిని ఇస్తుంది. దీనికి తోడు గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలుకు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా కవచ్ (Kavach) టెక్నాలజీ.
రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఇది. సాంకేతిక తప్పిదం వల్ల రైళ్లు ఒకే ట్రాక్‌పై వస్తే, వాటి మధ్య కిలోమీటర్ దూరం ఉండగానే.. ఈ వ్యవస్థ హెచ్చరికలు చేసి, రైలు వేగాన్ని ఆటోమేటిగ్గా నియంత్రిస్తుంది.