Vande Sadharan Train | ధర తక్కువ.. స్పీడ్‌ ఎక్కువ..! త్వరలో పట్టాలెక్కనున్న వందే సాధారణ్‌ రైలు..!

Vande Sadharan Train | కేంద్రంలోని మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేలో ప్రవేశ పెట్టింది. దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో పట్టాలెక్కిన సెమీ హైస్పీడ్‌ రైళ్లకు మంచి డిమాండ్‌ ఉన్నది. ఇప్పటి వరకు 25 రైళ్ల వరకు వందే భారత్‌ రైళ్లు పరుగులు పెడుతుండగా.. త్వరలోనే మరికొన్ని రైళ్లను పట్టాలెక్కించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నాలు చేస్తున్నది. అదే సమయంలో వందే భారత్‌ రైళ్లలో సరికొత్త వేరియంట్లను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నది. వందే భారత్‌ స్లీపర్‌, […]

Vande Sadharan Train | ధర తక్కువ.. స్పీడ్‌ ఎక్కువ..! త్వరలో పట్టాలెక్కనున్న వందే సాధారణ్‌ రైలు..!

Vande Sadharan Train | కేంద్రంలోని మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేలో ప్రవేశ పెట్టింది. దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో పట్టాలెక్కిన సెమీ హైస్పీడ్‌ రైళ్లకు మంచి డిమాండ్‌ ఉన్నది. ఇప్పటి వరకు 25 రైళ్ల వరకు వందే భారత్‌ రైళ్లు పరుగులు పెడుతుండగా.. త్వరలోనే మరికొన్ని రైళ్లను పట్టాలెక్కించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నాలు చేస్తున్నది.

అదే సమయంలో వందే భారత్‌ రైళ్లలో సరికొత్త వేరియంట్లను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నది. వందే భారత్‌ స్లీపర్‌, వందే మెట్రో, వందే సాధారణ్‌ రైళ్లను పరిచయం చేయనున్నది. ప్రస్తుతం సెమీ హైస్పీడ్‌ రైళ్లు 550 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తున్నాయి.

వీటిలో కేవలం చైర్‌కార్‌ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో ప్రవేశపెట్టనున్న వందే భారత్‌ రైళ్లు 550 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్‌ చేయనున్నాయి. ఇందులో మిగతా రైళ్లలో మాదిరిగానే స్లీపర్‌ బోగీలు ఏర్పాటు చేయనున్నారు.

ఇక వందే మెట్రో రైలు 100-150 కిలోమీటర్ల వరకు ఉన్న నగరాలను కవర్‌ చేయనున్నది. ఓ మెట్రో రైలు ప్రతి రోజు నాలుగైదు ట్రిప్పులు వేయనున్నది. ఇందులో చైర్‌కార్స్‌ అందుబాటులో ఉంటాయి.

వందే భారత్‌ రైళ్లలో మొత్తం ఏసీ బోగీలే ఉంటాయి. దాంతో ఛార్జీలు సైతం ఎక్కువగానే ఉంటున్నాయి. దాంతో సాధారణ మధ్య తరగతి ప్రజలు అందులో ప్రయాణించాలంటే భారంగానే ఉంటుంది. అలాంటి వారి కోసం తక్కువ చార్జీలతో వందే సాధారణ్‌ రైళ్లను తీసుకు రాబోతున్నది.

ఇందులో అన్నీ నాన్‌ ఏసీ బోగీలను ఏర్పాటు చేయనుండగా.. మిగతా సౌకర్యాలన్నీ వందే భారత్‌ రైళ్లలో ఉన్నట్లే ఉంటాయి. అయితే, వందే సాధారణ్‌ రైళ్ల ప్రారంభంపై చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా ఓ ప్రకటన చేశారు.సాధారణ్‌ రైలును అక్టోబర్‌లో ప్రారంభించనున్నట్లు చెప్పారు.

చెన్నై ఇంటర్నేషనల్ సెంటర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వందే సాధారణ్‌ రైళ్లపై ప్రకటన చేశారు. అయితే, ఈ రైలుకు వందే సాధారణ్‌ అనే పేరే ఉంటుందా? లేదంటే మరేదైనా పేరు మారుస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

కొత్తగా తీసుకురాబోతున్న నాన్‌ ఏసీ రైలులో 22 కోచ్‌లు ఉంటాయని, రెండు వైపులా లోకోస్ ఉంటాయని, పనితీరు విషయానికి వస్తే ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైలు లాగానే ఉంటుందని, గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణిస్తాయని ఆయన వివరించారు.

ఈ రైళ్లకు అంతకన్నా ఎక్కువ వేగం ఉండదని, రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగం మంచితే శబ్దం, దుమ్ము తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అప్పుడు రైలు విండోలకు షీల్డ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం వస్తుందని, షీల్డ్‌లు ఏర్పాటు చేస్తే ఏసీ తప్పనిసరి అవుతుందన్నారు. నాన్ ఏసీ బోగీలు కాబట్టి గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని మాల్యా వివరించారు.