Madgulapally | మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద VOAల మెరుపు ధర్నా.. స్తంభించిన ట్రాఫిక్

Madgulapaly | విధాత: నల్గొండ జిల్లా మాడుగులపల్లి టోల్గేట్ వద్ద విఓఏల మెరుపు ధర్నాకు దిగారు. వివోఏలతో పాటు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కూడా పాల్గొనగా ఈ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గత 44 రోజులుగా డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న వివోఏలు ఈ రోజు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద రాష్ట్రస్థాయి సమావేశం, ధర్నాకు వెళ్తున్న క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో మెరుపు ధర్నా, రాస్తారోకో […]

  • By: krs    latest    May 29, 2023 1:53 AM IST
Madgulapally | మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద VOAల మెరుపు ధర్నా.. స్తంభించిన ట్రాఫిక్

Madgulapaly |

విధాత: నల్గొండ జిల్లా మాడుగులపల్లి టోల్గేట్ వద్ద విఓఏల మెరుపు ధర్నాకు దిగారు. వివోఏలతో పాటు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కూడా పాల్గొనగా ఈ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

గత 44 రోజులుగా డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న వివోఏలు ఈ రోజు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద రాష్ట్రస్థాయి సమావేశం, ధర్నాకు వెళ్తున్న క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో మెరుపు ధర్నా, రాస్తారోకో చేపట్టారు.

మిర్యాలగూడ డివిజన్ చెందిన వివోఏలను పోలీసులు మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద అడ్డగించారు. పోలీసులు వారితో నిరసన విరమింప చేసేందుకు చర్చలు జరుపుతున్నారు.