Venkatesh: డీజే టిల్లు ద‌ర్శ‌కుడితో వెంక‌టేశ్‌

  • By: sr    latest    Dec 16, 2024 9:56 AM IST
Venkatesh: డీజే టిల్లు ద‌ర్శ‌కుడితో వెంక‌టేశ్‌

టాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ రెడీ అయింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను పూర్తి చేసిన విక్టరీ వెంకటేశ్ తన తదుపరి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గతంలో సిద్ధు జొన్నలగడ్డతో డీజే టిల్లు సినిమాను డెరెక్టర్‌గా పనిచేసి మంచి గుర్తింపును తెచ్చుకున్న విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

అక్కినేని నాగార్జున ‘ నా సామిరంగా’, నాగ చైతన్య ‘కస్టడీ’, రామ్ వారియర్, స్కంద చిత్రాలను నిర్మించిన శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం.

ఫుల్ కామెడీ, ఫ్యామిలీ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ సక్రాంతి తర్వాత ప్రారంభం కానున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు వెంకటేశ్ నటిస్తోన్న ‘రానా నాయుడు 2’ వెబ్ సిరీస్ షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తి చేసుకోగా వేసవిలో ప్రేక్షకుల‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది.