రాష్ట్ర రాజకీయాలకు భవిష్యత్తు దిక్సూచి మునుగోడు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

విధాత, నల్గొండ: కాంగ్రెస్ పార్టీకి మునుగోడు బలమైన స్థానమని పార్టీ విజయ కేంద్రమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలకు భవిష్యత్తు దిక్సూచిగా మునుగోడు ఉపఎన్నిక నిలవబోతుందన్నారు. మునుగోడు ప్రజల తీర్పు చైతన్యంతో ఉండాలని, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా, ఓటు విలువ చాటేలా, నోట్లతో ఓట్లు కొనాలనుకునే వారికి బుద్ధి చెప్పెలా, కాంగ్రెస్ పార్టీని గెలిపించేలా ఉండాలని […]

  • By: Somu    latest    Sep 18, 2022 10:43 AM IST
రాష్ట్ర రాజకీయాలకు భవిష్యత్తు దిక్సూచి మునుగోడు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

విధాత, నల్గొండ: కాంగ్రెస్ పార్టీకి మునుగోడు బలమైన స్థానమని పార్టీ విజయ కేంద్రమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలకు భవిష్యత్తు దిక్సూచిగా మునుగోడు ఉపఎన్నిక నిలవబోతుందన్నారు.

మునుగోడు ప్రజల తీర్పు చైతన్యంతో ఉండాలని, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా, ఓటు విలువ చాటేలా, నోట్లతో ఓట్లు కొనాలనుకునే వారికి బుద్ధి చెప్పెలా, కాంగ్రెస్ పార్టీని గెలిపించేలా ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మునుగోడు ప్రజల నిర్ణయాత్మక తీర్పుపై ఆధారపడి ఉందన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపైన మునుగోడు ప్రజలకు ఎనలేని అభిమానం ఉందన్నారు. సామ్యవాద లౌకికవాద భావజాలం కలిగిన మునుగోడు ప్రజలు వారికి ఉపయోగ పడే పార్టీలనే ఇప్పటివరకు గెలిపించారన్నారు. అలాంటి భావజాలం కలిగిన ప్రజలను డబ్బుతో కొనుగోలు చేయొచ్చన్న భ్రమల్లో టీఆర్ఎస్ బీజేపీలు ఉన్నాయన్నారు. సిద్ధాంతాల భావజాలానికి కట్టుబడి ఉంటారే తప్ప మునుగోడు ప్రజలు డబ్బులకు అమ్ముడు పోరని అన్నారు.

నిజాం అహంకారానికి వ్యతిరేకంగా పోరాడి రజాకార్ల మెడలు వంచిన గడ్డ మునుగోడు అన్నారు. కేంద్ర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఓటర్లను డబ్బుతో లొంగ దీసుకోవచ్చన్న భ్రమలతో వందల కోట్లు తీసుకొచ్చి మునుగోడు ప్రజల ఆత్మగౌరవంపై అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. డబ్బు అహంకారాన్ని ప్రదర్శిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ మెడలు వంచడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ సవాల్ చేస్తూ అధికారానికి డబ్బుకు అడ్డే లేదన్న అహంభావ పూరిత వాతావరణంలో తెలంగాణపై రాజకీయ దాడి చేయడానికి వస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలను అణగదొక్కాలని చూసిన ప్రతి సందర్భంలో మట్టి మనుషులుగా ఎదిరించి ఎదురొడ్డి పోరాటం చేశారు తప్ప తలవంచుకున్న చరిత్ర ఈ పోరాటాల గడ్డకు లేదన్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ఇక చాలు అని ప్రజలు అంటున్నారన్నారు. దోపిడి, అవినీతికి పాల్పడుతూ వనరులను ప్రజలకు ఇవ్వకపోగా తెచ్చుకున్న తెలంగాణను నవ్వుల పాలు చేస్తున్నారన్నారు. తెచ్చుకున్న ఈ సమాజంలో తలెత్తుకొని బతకాలన్న ఆత్మగౌరవం టీఆర్ఎస్ పాలనలో భంగపాటయింద న్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిన టీఆర్ఎస్ పార్టీ డబ్బు మద్యం ప్రలోభాలతో మునుగోడును ఆక్రమణ చేయాలని చూస్తున్నదన్నారు.

పేదలతో మమేకమై సామాన్యులతో కలిసిపోయి ప్రతి ఇంటి మనిషిగా ప్రజల హృదయాల్లో చిర స్థానాన్ని సంపాదించుకున్న దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తనయురాలు స్రవంతి మునుగోడు ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చిందన్నారు. ఆడబిడ్డ స్రవంతిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించడానికి మునుగోడు ప్రజలు సిద్ధమై ఉన్నారన్న నమ్మకం ఉందన్నారు.