సాగర్‌ను సందర్శించిన వియత్నాం బౌద్ధ బిక్షువులు
విధాత: నాగార్జునసాగర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధ వనాన్ని బుధవారం వియత్నాం దేశానికి చెందిన నూట ముప్పై మంది బౌద్ధ బిక్షువులు సందర్శించారు. వియత్నాం దేశం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న వీరికి బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆహ్వానం పలికారు. నాగార్జునసాగర్ బుద్ధ వనంలోని బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం ధ్యాన మందిరంలో కొద్దిసేపు ధ్యానం చేశారు. వీరికి బుద్ధ వనం విశేషాలను బౌద్ధ నిపుణులు బుద్ధ వనం కన్సల్టెంట్ డాక్టర్ […]

విధాత: నాగార్జునసాగర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధ వనాన్ని బుధవారం వియత్నాం దేశానికి చెందిన నూట ముప్పై మంది బౌద్ధ బిక్షువులు సందర్శించారు. వియత్నాం దేశం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న వీరికి బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆహ్వానం పలికారు.
నాగార్జునసాగర్ బుద్ధ వనంలోని బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం ధ్యాన మందిరంలో కొద్దిసేపు ధ్యానం చేశారు. వీరికి బుద్ధ వనం విశేషాలను బౌద్ధ నిపుణులు బుద్ధ వనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు.
అనంతరం వీరు నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. వీరితోపాటు బుద్ధ వనం ఓఎస్డి సుధన్ రెడ్డి, ఎస్ ఈ క్రాంతి బాబు, బుద్ధ వనం డిజైన్ ఇన్చార్జి శ్యాంసుందర్రావు తదితరులు ఉన్నారు.