Manipur | మణిపూర్‌లో మళ్లీ హింస
Manipur తాజా కాల్పుల్లో మహిళ మృతి విధాత: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. తాజా కాల్పుల్లో ఒక మహిళ చనిపోయింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఈ పాఠశాల బయట ఈ ఘటన చోటుచేసుకున్నది. గురువారం జరిగిన కాల్పుల ఘటనలో మళ్లీ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మణిపూర్‌లో మైతేయి, కుకీల అనే రెండు జాతుల మధ్య మొదలైన హింస.. కొన్ని నెలలుగా రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నది. ఇటీవల కొంత హింసాత్మక ఘటనలు సద్దుమణిగినట్టు […]

Manipur
- తాజా కాల్పుల్లో మహిళ మృతి
విధాత: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. తాజా కాల్పుల్లో ఒక మహిళ చనిపోయింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఈ పాఠశాల బయట ఈ ఘటన చోటుచేసుకున్నది. గురువారం జరిగిన కాల్పుల ఘటనలో మళ్లీ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మణిపూర్‌లో మైతేయి, కుకీల అనే రెండు జాతుల మధ్య మొదలైన హింస.. కొన్ని నెలలుగా రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నది.
ఇటీవల కొంత హింసాత్మక ఘటనలు సద్దుమణిగినట్టు కనిపించాయి. పాఠశాలలు కూడా సోమవారం నుంచి మొదలయ్యాయి. రాష్ట్రంలో మైతేయి, కుకీల మధ్య కొంతమేర సానుకూల ఒప్పందం జరిగినట్టు వార్తలు వచ్చాయి.
కానీ, ఇంతలోనే మళ్లీ ఏం జరిగిందో తెలియని కానీ, కాల్పుల ఘటన మళ్లీ కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మహిళ చనిపోవడం హింసకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. తాజా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉన్నది