Viral Video | ఇదెక్కడి పెళ్లాంరా బాబోయ్‌..! రైల్వేస్టేషన్‌లో రెజ్లర్‌లా భర్తను చితకొట్టేసింది..!

Viral Video | భార్యభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. ఏదో ఒక్క సందర్భంలో ఒకరినొకరు తిట్టుకోవడం సాధారణమైన విషయమే. కొందరు చేయి చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. గొడవలన్నీ ఇంట్లో నాలుగు గోడల మధ్యకే పరిమితమవుతుంటాయి. కొందరు బహిరంగంగానే గొడవలు పడుతుంటారు. చాలా సందర్భాల్లో భర్త భార్యను కొట్టడం, తిట్టడం కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో గొడవలు మరీ ఎక్కువయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా […]

Viral Video | ఇదెక్కడి పెళ్లాంరా బాబోయ్‌..!  రైల్వేస్టేషన్‌లో రెజ్లర్‌లా భర్తను చితకొట్టేసింది..!

Viral Video |

భార్యభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. ఏదో ఒక్క సందర్భంలో ఒకరినొకరు తిట్టుకోవడం సాధారణమైన విషయమే. కొందరు చేయి చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. గొడవలన్నీ ఇంట్లో నాలుగు గోడల మధ్యకే పరిమితమవుతుంటాయి. కొందరు బహిరంగంగానే గొడవలు పడుతుంటారు. చాలా సందర్భాల్లో భర్త భార్యను కొట్టడం, తిట్టడం కనిపిస్తుంది.

ఈ మధ్య కాలంలో గొడవలు మరీ ఎక్కువయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. భర్తను ఓ భార్య రెజ్లింగ్‌ రింగ్‌లో మాదిరిగా భర్తను చితకొట్టేసింది. ఇందుకు రైల్వేస్టేషన్‌ వేదికైంది.

ఈ వీడియోను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను చూసిన పలువురు ఇదేం పెళ్లాంరా బాబోయ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఘర్‌ కా కాలేష్‌ అనే ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

దేశంలో జరుగుతున్న గొడవల నుంచి మనకు స్వాతంత్య్రం కావాలి. రైల్వే స్టేషన్‌లో భార్యభర్తలు కొట్టుకున్న వీడియోనూ చూసి ఎంజాయ్‌ చేయండి’ అంటూ వీడియో క్యాప్షన్‌ ఇచ్చారు. వీడియో ప్రకారం.. భార్యభర్త రైల్వేస్టేషన్‌లో వెళ్తున్నారు. భార్య కోపంగా హ్యాండ్‌ బ్యాగ్‌ భుజానికి వేసుకుంటుండగా.. భర్త ఏదో అనగా.. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన భార్య.. భర్త చెంప చెల్లుమనిపించింది.

అక్కడితో ఆగకుండా రెజ్లింగ్‌లో మాదిరిగి భర్త కాళ్లను పట్టుకొని ఎత్తిపడేసింది. ఆపై అతనిపై కూర్చొని.. జుట్టుపట్టుకొని ముఖంపై పిడిగుద్దులు గుద్దింది. ఆమె నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా భర్తకు అవకాశం దొరకలేదు.

అయితే, అక్కడ ఉన్న వారంతా చూస్తూ ఉన్నారే తప్ప ఆపేందుకు ప్రయత్నం చేయలేదు. సదరు మహిళ బక్కగానే ఉన్నా.. భర్తను మాత్రం చితకొట్టేసింది. అయితే, వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొందరు భర్తపై జాలి వ్యక్తం చేయగా.. మరికొందరు ఆమె ఫైటర్‌లా ఉందంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.