KA PAUL: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడే బాధ్యత నాదే! బరిలోకి దిగిన KA పాల్.. ఆయన వెంట మాజీ JD

యాక్టింగ్ రాదు.. యాక్షన్‌లోకి దిగడమే వచ్చంటున్న పాల్‌! విధాత: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆఖరుకు కామెడీ పీసుగా మారిపోయింది. దారిన‌బోయిన వాళ్ళందరూ వచ్చి ఆ సంస్థను కాపాడతాం అని అంటున్నారు. మొన్న కేసీఆర్ తరఫున వచ్చిన సింగరేణి అధికారులు సైతం ఉక్కును కాపాడుతాం అన్నారు. ఇక ఇప్పుడు ప్రజా శాంతి పార్టీ నాయకుడు కెయే పాల్ రంగంలోకి దిగారు. తనకు వందలాదిమంది దేశాధ్యక్షులు తెలుసని, ఇరాక్ యుద్ధాన్ని ఆపింది తానేనని, బుష్ .. గోర్బచేవ్.. ఇంకా ప్రముఖ […]

KA PAUL: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడే బాధ్యత నాదే! బరిలోకి దిగిన KA పాల్.. ఆయన వెంట మాజీ JD
  • యాక్టింగ్ రాదు.. యాక్షన్‌లోకి దిగడమే వచ్చంటున్న పాల్‌!

విధాత: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆఖరుకు కామెడీ పీసుగా మారిపోయింది. దారిన‌బోయిన వాళ్ళందరూ వచ్చి ఆ సంస్థను కాపాడతాం అని అంటున్నారు. మొన్న కేసీఆర్ తరఫున వచ్చిన సింగరేణి అధికారులు సైతం ఉక్కును కాపాడుతాం అన్నారు. ఇక ఇప్పుడు ప్రజా శాంతి పార్టీ నాయకుడు కెయే పాల్ రంగంలోకి దిగారు.

తనకు వందలాదిమంది దేశాధ్యక్షులు తెలుసని, ఇరాక్ యుద్ధాన్ని ఆపింది తానేనని, బుష్ .. గోర్బచేవ్.. ఇంకా ప్రముఖ దేశాల నేతలు తనకు ఫ్రెండ్స్ అని పలుమార్లు గతంలో చెప్పిన పాల్ ఇప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణకు సిద్ధం అయ్యానని విశాఖలో అన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని క్లెయిమ్ చేసుకున్నారు. ఇంకా ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని చెప్పారు.

వైసీపీ నుంచి ఇంత మంది ఎంపీలు ఉన్నా వారు ఈ సంస్థ గురించి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నంచటం లేదన్నారు. తనకు యాక్టింగ్ రాదని యాక్షన్ లోకి దిగడమే వచ్చని చెప్పారు. ఆశ్చర్యంగా ఆయన వెంట సీబీఐ మాజీ జేడి లక్ష్మి నారాయణ సైతం ఉన్నారు.

ప్రజల నుంచి నిధులు వసూలు చేసి స్టీల్ ప్లాంట్ బిడ్డింగులో పాల్గొంటామని గతంలో చెప్పిన జేడి గారు ఇప్పుడు పాల్‌తో కలిసి రావడం చూసిన జనాలు, మీడియా విలేకరులు షాక్ తిన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవటం కోసం ప్రతి ఒక్కరితో తాను కలిసి పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు.

ప్రతి ఒక్కరితో కలిసి పోరాడడం తప్పు లేదు కానీ మరీ పాల్‌తో కలిసి మాత్రం వెళ్ళకండి స్వామీ అంటూ విద్యావంతులు, యువకులు ఆయనకు సూచిస్తున్నారు. ఆఖరుకు స్టీల్ ప్లాంట్ అనే ఒక భారీ కంపెనీ ఇలా కమెడియన్లకు అలుసుగా మారిందా దేవుడా అని విశాఖ వాసులు ఘోల్లుమంటున్నారు.