Visakha-Brahmapur Passenger | ఉత్తరాంధ్ర వాసులకు గుడ్‌న్యూస్‌..! విశాఖ-పలాస ప్యాసింజర్‌ బరంపుర వరకు పొడిగింపు..!

ఉత్తరాంధ్ర రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. విశాఖ-పలాస ప్యాసింజర్‌ రైలును పొడిగిస్తున్నట్లుగా శుభవార్త చెప్పింది

Visakha-Brahmapur Passenger | ఉత్తరాంధ్ర వాసులకు గుడ్‌న్యూస్‌..! విశాఖ-పలాస ప్యాసింజర్‌ బరంపుర వరకు పొడిగింపు..!

Visakha-Brahmapur Passenger | ఉత్తరాంధ్ర రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. విశాఖ-పలాస ప్యాసింజర్‌ రైలును పొడిగిస్తున్నట్లుగా శుభవార్త చెప్పింది. విశాఖప‌ట్నం-ప‌లాస వ‌ర‌కు ప్యాసింజ‌ర్ నడవగా.. ఈ రైలు ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్‌కు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. విశాఖ-పలాస మధ్య నడుస్తున్న మెమూ రైలును ఇచ్ఛాపురం మీదుగా ఒడిశాలోని బరంపురం వరకు కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి పాసింజ‌ర్ రైలు సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజూ నగరానికి ఈ ప్రాంతం నుంచి ప్రయాణాలు చేస్తుంటారు.

ముఖ్యంగా ప్యాసింజర్‌ సౌకర్యం లేక ప్రయాణికులు భారీగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్యాసింజర్‌ అందుబాటులో లేకపోవడంతో వృద్ధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులున్న వారు తెల్లవారుజామున బస్సులో వెళ్తే ఎక్కువగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-ప‌లాస ప్యాసింజ‌ర్ రైలును బ్రహ్మపుర స్టేష‌న్ వరకు రైల్వే ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి ఒకటో వరకు విశాఖ‌- పలాస పాసింజర్‌ రైలు బ్రహ్మపుర స్టేష‌న్ వరకు పొడిగించారు.

ఈ ప్యాసింజర్‌ రైలు బ్రహ్మపురలో తెల్లవారు జామున 3.50 గంటలకుబయలుదేరి ఇచ్ఛాపురం, సోంపేట, మందస, పలాసకు 5గంటలకు చేరుతుంది. 9.20 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. రైలు తిరిగి విశాఖపట్నంలో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి రాత్రి 10.31 సమయానికి ఇచ్ఛాపురం చేరుకోగా.. రాత్రి 10.47 గంటలకు బ్రహ్మపురానికి చేరుకోనున్నది. విశాఖ-పలాస ప్యాసింజర్‌రైలును బ్రహ్మపుర వరకు పొడిగించడంపై రైల్వేశాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపుతున్నారు.