WARANGAL: బాలునిపై కుక్క దాడి.. కాపాడిన మహిళ ( Video)
వరంగల్ నగరంలో సంఘటన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించి కుక్క దాడి నుంచి బాలుని ప్రాణాపాయం నుంచి కాపాడిన సంఘటన వరంగల్ నగరంలో శుక్రవారం జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని 22వ డివిజన్ ఫస్ట్ బ్యాంకు కాలనీలో ఇద్దరు చిన్నారులు నడుచుకుంటూ వెళుతుండగా ఎదురు నుంచి వచ్చిన కుక్క ఆకస్మికంగా ఆరేళ్ల జశ్వంత్ అనే బాలునిపై దాడి చేసి కరిచింది. బాలుని కేకలు, కుక్క దాడిని ఎదురుగా ఉన్న […]

వరంగల్ నగరంలో సంఘటన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించి కుక్క దాడి నుంచి బాలుని ప్రాణాపాయం నుంచి కాపాడిన సంఘటన వరంగల్ నగరంలో శుక్రవారం జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నగరంలోని 22వ డివిజన్ ఫస్ట్ బ్యాంకు కాలనీలో ఇద్దరు చిన్నారులు నడుచుకుంటూ వెళుతుండగా ఎదురు నుంచి వచ్చిన కుక్క ఆకస్మికంగా ఆరేళ్ల జశ్వంత్ అనే బాలునిపై దాడి చేసి కరిచింది.
బాలుని కేకలు, కుక్క దాడిని ఎదురుగా ఉన్న ఒక మహిళ చూసి పరుగున వచ్చి గట్టిగా కేకలు వేసి కుక్కను తరిమికొట్టింది. దీంతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే అప్పటికే కుక్క బాలుడి చేయిని పలు చోట్ల కరిచింది.